ఊహించిన విధంగానే హరితేజ ఈ వారం హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. తక్కువ ఓట్లు వచ్చన కారణంగా హరితేజ్ బిగ్‌బాస్ హౌజ్ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. హరితేజ బిగ్‌బాస్ సీజన్-8లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే హరితేజతో పాటు గంగవ్వ కూడా ఈవారం సెల్ఫ్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో గంగవ్వ స్వయంగా బయటకు వచ్చేసింది.
కాగా ఎలిమినేషన్ ప్రకటించిన తర్వాత స్టేజ్‌పైకి వచ్చిన హరితేజ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ రకంగా ఎమోషనల్‌కు గురైందని చెప్పాలి. హౌజ్ నుంచి వెళ్లిపోవడం ఒకింత తనకు సంతోషంగా ఉందని తెలిపింది. పాప వేచి చూస్తుండడమే ఇందుకు కారణమని హరితేజ భావోద్వేగానికి గురైంది. ఇక హౌస్‌లో ఉన్న వాళ్లలో ఎవరు మాస్క్‌లు తీసి ఆడాలో చెప్పాలని నాగార్జున కోరగా.. హరితేజ్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది.
ఈ సందర్భంగా అవినాష్ గురించి మాట్లాడుతూ.. అవినాస్ నవ్వుతూ, నవ్విస్తూ అందరి మనుసులు గెలుచుకున్నాడు. కానీ, ఎమోషన్స్, కోపం, ఎవరెవరు నచ్చటం లేదనే విషయాన్ని తెలియనీయడం లేదని చెప్పుకొచ్చింది. దీంతో అవినాష్ వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థం కావడం లేదని పర్సనాలిటీ ఏంటో తెలిసేలా మాస్క్ తీసేసి ఆడితే బెటర్ అంటూ సూచించింది.
ఇక టేస్టీ తేజ గురించి మాట్లాడుతూ.. రూల్స్ చెప్పడం కాదని, పాటించాలని చురకలు అంటించింది. కిచెన్‌లో ఎంత మనస్ఫూర్తిగా వంట చేస్తారో అలాగే ఆట ఆడి మీ నిజమైన వ్యక్తిత్వం చూపించండని చెప్పుకొచ్చింది. ఇక ప్రేరణ చాలా మంది అమ్మాయని.. అయితే కొన్ని చెడు లక్షణాలు ఆమె చేసే మంచిని కప్పేస్తునాయని తెలిపింది.
అలాగే రోహిణీ తను కప్పుకొన్న షీల్డ్ పగలగొట్టుకుని బయటకు వచ్చి ఆడాలని సూచించింది. అన్నింటినీ మనసుకు తీసుకుని ఎక్కువ సేపు ఏడవటం మంచిది కాదని హితవు పలికింది. నిఖిల్ తన భావోద్వేగాలను చూపించాల్సిన అవసరం ఉందన్న హరితేజ.. కేవలం కోపాన్ని మాత్రమే చూపించొద్దంటూ హితవు పలికింది.