Shukra: అమెజాన్ లో థ్రిల్లర్ మూవీ 'శుక్ర' మిస్ కావద్దు
Shukra: కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అన్ని రంగాలపై పడింది.
Shukra: కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అన్ని రంగాలపై పడింది. సినీ ఇండస్ట్రీపై కరోనా ప్రభావం తీవ్రంగానే ఉందని చెప్పాలి. 2020లో కరోనా కారణంగా అనేక సినిమాలు విడుదలకు నోచుకోలేదు. ఈ ఏడాది మొదట్లో కరోనా ప్రభావం తగ్గి పరిస్థితులు కుదుటపడడంతో సినిమాలు రిలీజులు ఊపందుకున్నాయి. కరోనా సెకండ్ వేవ్ పుణ్యమా అని మళ్లీ గడ్డుపరిస్థితులు వచ్చాయి. కరోనా కారణంగా థియేటర్లు మూతపడే సరికి కొన్ని సినిమాలకు ఓటీటీ ప్రత్యామ్నయం గా కనిపించింది. దీంతో సినిమాలు అన్ని ఓటీటీ వేదికగా రిలీజ్ కావడం మొదలు పెట్టాయి.
ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు, సరికొత్త సినిమాల విడుదలతో ఒటీటీలు వీక్షకులకు అరచేతిలోనే అన్ని చూపిస్తున్నాయి. తిరిగి థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితుల మధ్య.. ఇప్పుడు ఓటీటీల హవా బాగా నడుస్తోంది. 'వకీల్ సాబ్' తర్వాత థియేటర్లలో విడుదలైన చిత్రం 'శుక్ర'. ఈ ఏడాది థియేటర్లలో రిలీజైన చివరి సినిమా ఇది. మైండ్ గేమ్ నేపథ్యంలో థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో వెంటనే థియేటర్లు మూతపడ్డాయి.దీంతో చిత్రయూనిట్ మాత్రం వెంటనే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేసింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ చిత్రానికి చాలా మంచి స్పందన వస్తున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది.
అమెజాన్ ప్రైమ్‌లో విడుదల ఈ సినిమా అమితంగా ఆకట్టుకుంటుంది. అరవింద్ కృష్ణ, శ్రీజితా ఘోష్ ప్రధాన పాత్రల్లోసుకు పూర్వజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. నిర్మాతలు అయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లె మీడియాకు మాట్లాడారు. సినిమాలో ప్రైమ్ లో ప్రేక్షకులు ఆదరిస్తున్నారని తెలిపారు. ఫుల్ థ్రిల్లర్‌ను మిస్ అయిన వారంతా ప్రైమ్‌లో ఎంజాయ్ చేయండి అంటూ నిర్మాతలు కోరుతున్నారు.