OTT: ఐదు సినిమాలు ఓటీటీలో రిలీజ్

OTT: క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌భావం అన్ని రంగాల‌పై ప‌డింది.

Update: 2021-05-14 10:33 GMT

ఓటీటీ ఫైల్ ఫోటో 

OTT: క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌భావం అన్ని రంగాల‌పై ప‌డింది. ఇక సినీ ఇండ‌స్ట్రీపై క‌రోనా ప్ర‌భావం తీవ్రంగానే ఉంద‌ని చెప్పాలి. 2020లో క‌రోనా కార‌ణంగా అనేక సినిమాలు విడుద‌ల‌కు నోచుకోలేదు. దీంతో సినిమాలు అన్ని ఓటీటీ వేదిక‌గా రిలీజ్ కావ‌డం మొద‌లు పెట్టాయి. ఈ ఏడాది మొద‌ట్లో క‌రోనా ప్ర‌భావం త‌గ్గి ప‌రిస్థితులు కుదుట‌ప‌డ‌డంతో సినిమాలు రిలీజులు ఊపందుకున్నాయి. క‌రోనా సెకండ్ వేవ్ పుణ్య‌మా అని మ‌ళ్లీ గ‌డ్డుప‌రిస్థితులు వ‌చ్చాయి. థియేట‌ర్లు మూత‌ప‌డే స‌రికి కొన్ని సినిమాల‌కు ఓటీటీనే ప్ర‌త్యామ్న‌యంగా క‌నిపించింది.

'బట్టల రామస్వామి బయోపిక్' సినిమాతో డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లకు శ్రీకారం చుడుతోంది. ఈ సినిమా జీ 5లో మే 14 నుంచి అందుబాటులోకి రానుంది. అల్తాఫ్ హసన్, శాంతి రావ్, సాత్విక, లావణ్యరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వ‌హించాడు. ఈ చిత్రానికి నిర్మాతలుగా 'సెవెన్ హిల్స్' సతీష్ కుమార్ ఐ, మ్యాంగో మీడియా రామకృష్ణ వీరపనేని వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు.


విజయ్‌ సేతుపతి తెలుగువారికి కూడా సుపరిచితుడే. తన సినిమాలు, నటనతో జనాలకు పూనకం తెప్పిస్తాడు. విజయ్‌ సేతుపతి ప్రస్తుతం తుగ్లక్‌ దర్బార్‌, మామనితన్‌, లాభం చిత్రాలు చేస్తున్నాడు. మరోవైపు ఆయన నటించిన 'విజయ్‌ సేతుపతి' సినిమా ఆహాలో నేటి(మే 14) నుంచి ప్రసారం కానుంది.

మే 14(ఈరోజు ) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా బండి ప్రసారం కానుంది. ఈ సినిమాతో ప్రవీణ్‌ కండ్రిగుల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సినిమా బండి విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

తమిళ హీరో ధనుష్‌ నటించిన కర్ణన్‌ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో నేటి(మే 14) నుంచి ప్రసారం కానుంది. ఏప్రిల్‌ 9న థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్‌ దగ్గర కాసులు కురిపించిన ఈ సినిమా ఓటీటీని ఎలా షేక్‌ చేస్తుందో చూడాలి.

యూత్ స్టార్ హీరో నితిన్‌ ఖైదీగా, ప్రియా వారియర్‌ అతడి ప్రేయసిగా నటించిన చిత్రం చెక్‌. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ లాయర్‌గా కనిపించింది. చంద్రశేఖర్‌ యేలేటి తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 26న థియేటర్లలో రిలీజైంది. తాజాగా ఓటీటీ బాట పట్టిన ఈ మూవీ నేటి నుంచి సన్‌ నెక్స్ట్‌ యాప్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.



Tags:    

Similar News