Disha Patani: డ్రెస్సే కారణమా? దిశా పటాని డ్యాన్స్‌పై బ్రాడ్‌క్యాస్టర్లు సెన్సార్‌షిప్! ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలో షాకింగ్ ఘటన!
Disha Patani: దిశా పటానీ డ్యాన్స్‌ను ఎందుకుకట్ చేశారు? ఇప్పుడితే సోషల్‌మీడియాలో వైరల్ టాపిక్!

Disha Patani: డ్రెస్సే కారణమా? దిశా పటాని డ్యాన్స్‌పై బ్రాడ్‌క్యాస్టర్లు సెన్సార్‌షిప్! ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలో షాకింగ్ ఘటన!
Disha Patani: కరెక్ట్ లైటింగ్, EDM బీట్స్, వెనుక భారీ LED స్క్రీన్.. స్టేజీ మీద దిశా పటాని అడుగులు వేస్తోంది. ఆమె స్టెప్పులకు మైమరచిపోతున్న ప్రేక్షకులు, టీవీలో ఫ్యాన్స్ చేతులు చప్పట్లతో హోరెత్తిస్తున్నారు. ఒక్కసారిగా టీవీలో ఆమె డ్యాన్స్‌ను కట్ చేశారు. టీవీల ముందు కూర్చున్నవారు ఒక్కసారిగా
షాక్ అయ్యారు. ఏమైంది?ఎందుకు? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నించారు.
దిశా వేసుకున్న దుస్తులు అసహ్యంగా ఉన్నాయా? లేక డ్యాన్స్ స్టెప్పులు IPL నిర్వాహకులకు బోల్డ్‌గా అనిపించాయా? లేక టెక్నికల్ ఫల్క్? ఏ కారణం చూపినా, ఫ్యాన్స్ మాత్రం ఏ మాత్రం ఒప్పుకోలేదు. ఈ ఘటన ఒక విషయాన్ని గుర్తు చేసింది. ఇది కేవలం ఒక స్టేజీ షో కాదు. ఇది ఒక ఆర్టిస్టు ఆత్మవిశ్వాసం, ప్రేక్షకుల ఆనందం, వారి మధ్య ఉండే కనెక్ట్. దాన్ని మధ్యలోనే ఛిన్నాభిన్నం చేయడం ఎంత వరకు కరెక్ట్?
నిజానికి దిశా డ్యాన్స్ అంటే కేవలం బాడీ మూవ్‌మెంట్ కాదు. అది ఒక ఎక్స్‌ప్రెషన్, ఆర్ట్, ఎనర్జీ, అటిట్యూడ్ మిక్స్. ఆమె డాన్స్‌ల్లో ఉండే స్పార్క్, ఆ హంగు ఆమెదే ప్రత్యేకత. ఐపీఎల్ వేదిక మీద అలాంటి డ్యాన్స్‌ను ఒక్కసారిగా కట్ చేయడం ఆమె అభిమానులకు పెద్ద షాక్‌కు గురి చేసంది. ఇక దిశా పటాని అనగానే గుర్తుకొచ్చే రెండు విషయాలు. గ్లామర్, గ్రేస్. బాలీవుడ్‌లో తన డాన్స్ మూమెంట్స్‌తో తక్కువ కాలంలోనే గొప్ప గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో మాత్రమే కాదు, అవార్డ్ షోలు, బ్రాండ్ ఈవెంట్లు, లైవ్ పెర్ఫార్మెన్స్‌లలో తనకు తానుగా నిలిచిన తీరు దిశా చాలా చాలా స్పెషల్. ఆమె స్టెప్పుల్లో ఒక రేంజ్ స్టైలిష్ ఎలిగెన్స్ ఉంటుంది. మరీ ముఖ్యంగా యూత్ ఆడియెన్స్ ఆమెను డాన్స్‌కు ఫిదా అవుతారు.