Deepika Padukone: ఆస్కార్ అవార్డులపై దీపికా సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?
Deepika Padukone: సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అత్యున్నత పురస్కరాల్లో ఆస్కార్ అవార్డు ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Deepika Padukone: ఆస్కార్ అవార్డులపై దీపికా సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?
Deepika Padukone: సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అత్యున్నత పురస్కరాల్లో ఆస్కార్ అవార్డు ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ సినిమా మేకర్ ఆస్కార్ లక్ష్యంగానే తన అడుగులు వేస్తుంటారు. అయితే తాజాగా అందాల తార, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ఆస్కార్ అవార్డులకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విడుదల చేసిన ఓ వీడియోలో దీపికా తన మనసులోని మాటను బయటపెట్టింది.
ఈ సందర్భంగా దీపికా మాట్లాడుతూ.. భారత సినీ పరిశ్రమలో ఎన్నో గొప్ప కథలు, ప్రతిభావంతులైన నటీనటులు ఉన్నారని చెప్పుకొచ్చింది. మన సినిమాలకు, కథలకు, మన నటీనటుల ప్రతిభకు ప్రపంచ స్థాయిలో మరింత గుర్తింపు రావాల్సిందని, కానీ చాలాసార్లు మనకు రావాల్సిన అవార్డులు మన నుంచి దూరమయ్యాయని దీపికా తెలిపింది. భారత సినీ చరిత్రలో ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయని, కానీ వాటికి ఆస్కార్ వేదికపై స్థానం లభించలేదని దీపికా ఆవేదన వ్యక్తం చేసింది.
ట్రిపులార్ సినిమాకు అవార్డ్ వచ్చిన రోజులను గుర్తు చేసుకున్న దీపికా.. తనకు ఆ సినిమాతో ఎలాంటి సంబంధం లేదని కానీ.. 'నాటు నాటు' పాటకు ఆస్కార్ ప్రకటించిన క్షణం తన గుండె ఉప్పొంగిందని తెలిపింది. ప్రేక్షకుల మధ్య కూర్చొని చూసిన క్షణాన్ని మరిచిపోలేనని, భారతీయురాలిగా ఎంతో గర్వంగా అనిపించింది అని దీపికా చెప్పుకొచ్చింది.
అలాగే ఈ ఏడాది ‘ది బ్రూటలిస్ట్’ చిత్రంలో నటించిన అడ్రియన్ బ్రాడీకి ఉత్తమ నటుడు అవార్డు రావడంపై కూడా సంతోషం వ్యక్తం చేసింది. ఇక 2023 ఆస్కార్ వేడుకలో దీపిక పదుకొణె వేదికపైకి వచ్చి, 'నాటు నాటు' పాటను పరిచయం చేసిన తీరు ప్రేక్షకుల నుంచి ఎంతో అభినందనలు పొందింది. ‘‘డు యూ నో నాటు? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటారు. ఇది ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం నుంచి వచ్చిన పాట.. నాటు నాటు..’’ అంటూ పరిచయం చేయగానే ఆ వేదిక మొత్తం చప్పట్లతో మార్మోగిన విషయం తెలిసిందే.