హీరోయిన్ రష్మికకు లేని ప్రాబ్లం మీకెందుకు? సికందర్ ట్రైలర్ సందర్భంగా సల్మాన్ ఫైర్

Sikandar movie trailer : హీరోయిన్ రష్మికకు లేని ప్రాబ్లం మీకెందుకు? సికందర్ ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్‌లో సల్మాన్ ఫైర్
Salman Khan's reply about his age gap with Rashmika Mandanna in Sikandar movie: సల్మాన్ ఖాన్, రష్మిక మందన జంటగా నటించిన సికందర్ మూవీ ఈ రంజాన్ సంద్భంగా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. సౌతిండియాలోని టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన ఏ.ఆర్. మురుగదాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. గజిని, స్టాలిన్, తుపాకీ, కత్తి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ డైరెక్ట్ చేసిన మురుగదాస్ మరోసారి బాలీవుడ్ హీరోతో సినిమా తీస్తున్నాడు అనగానే సికందర్ మూవీపై భారీ హైప్ ఏర్పడింది. అందులోనూ సల్మాన్ ఖాన్ హీరో అవడం, పుష్ప, యానిమల్ వంటి సినిమాలతో హిందీ మార్కెట్‌లోనూ క్రేజ్ సంపాదించుకున్న రష్మిక మందన హీరోయిన్ అవడంతో ఆ హైప్ ఇంకా డబుల్ అయింది.
అయితే, ఈ సినిమా లాంచ్ అయినప్పటి నుండి సల్మాన్ ఖాన్‌ను కొంతమంది నెటిజెన్స్ ఒక విషయంలో అదే పనిగా ట్రోలింగ్ చేస్తున్నారు. అదే హీరో, హీరోయిన్ ఇద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్. సల్మాన్ ఖాన్ వయస్సు 59 ఏళ్లు, రష్మిక మందన వయస్సు 28 ఏళ్లు. దీంతో 31 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్న హీరోయిన్ తో జోడీ ఏంటని కొంతమంది నెటిజెన్స్ సల్మాన్ ను టీజ్ చేస్తున్నారు.
ఈ ఆదివారం సికందర్ మూవీ ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌లో సల్మాన్ ఖాన్ ఆ ట్రోలర్స్‌కు చెక్ పెడుతూ వారికి ఘాటుగా సమాధానం ఇచ్చారు. నాతో సినిమా చేస్తోన్న హీరోయిన్‌కు లేని ప్రాబ్లం మధ్యలో మీకెందుకు అని రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. అంతేకాదు... "రష్మిక పెళ్లి చేసుకుని ఆమెకు ఓ బిడ్డ పుడితే ఆమెతో కూడా సినిమా చేస్తా. వాళ్ల మమ్మీ ( రష్మిక) ఎలాగూ పర్మిషన్ ఇస్తుంది. మీకేమైనా అభ్యంతరమా?" అంటూ సల్మాన్ ఖాన్ తనను ట్రోల్ చేసే వారికి కౌంటర్ ఇచ్చారు.
ఇక ఈ ఏజ్ గ్యాప్ మ్యాటర్ కాసేపు పక్కనపెడితే... సల్మాన్ ఖాన్ సికందర్ మూవీ ట్రైలర్ కూడా ప్రామిసింగ్‌గా ఉంది. ఏ.ఆర్. మురుగదాస్ మార్క్ కనిపించేలా ట్రైలర్ కట్ చేశారు. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తరువాత మురుగదాస్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియడ్ వాలా నిర్మించిన సికందర్ మూవీ మార్చి 30న రిలీజ్ అవుతోంది.