Tollywod: రూ. 50 కోట్ల మార్క్‌ దాటేసిన చిన్న సినిమా.. ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన

Update: 2025-03-26 05:46 GMT
Tollywod: రూ. 50 కోట్ల మార్క్‌ దాటేసిన చిన్న సినిమా.. ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన
  • whatsapp icon

హర్ష్‌ రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి, శివాజీ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కోర్ట్’. వాల్‌ పోస్టర్‌ సినిమా పతాకంపై నాని సమర్పణలో వచ్చిన ఈ చిత్రం చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం సాధించింది. కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన పదో రోజుకే రూ.50 కోట్లు (గ్రాస్) వసూలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది.

రామ్‌ జగదీశ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ నటన ప్రత్యేకంగా నిలిచింది. ఆయన తన పాత్రను అద్భుతంగా పోషించారని సినీ ప్రముఖులు ప్రశంసించారు. నెటిజన్లు "ఇండస్ట్రీకి మరో విలన్ దొరికాడు" అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓవర్సీస్‌లోనూ మంచి విజయాన్ని సాధించింది. చిన్న సినిమానే అయినా ప్రీ-సేల్ బుకింగ్స్ నుంచే మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం తాజాగా వన్ మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది.

ఈ సినిమా విజయంపై నాని స్పందిస్తూ.. ఇది "తెలుగు సినిమాల స్థాయిని పెంచే సినిమా" అని అన్నారు. చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాలు సాధించగలవని కోర్ట్ నిరూపించిందని చెప్పారు. ఇదిలా ఉంటే మరే పెద్ద సినిమా పోటీలో లేకపోవడం, పాజిటివ్‌ టాక్‌ రావడంతో కోర్టు మూవీ కలెక్షన్లను మరింత పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంతకీ సినిమా కథేంటంటే..

సమాజంలో న్యాయం కోసం పోరాడే ఓ సాధారణ యువకుడి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ కథ 2013 నాటి నేపథ్యంలో సాగుతుంది. చందు (హర్ష్‌ రోషన్) ఇంటర్ ఫెయిల్ అయిన ఓ యువకుడు. ఉపాధి కోసం పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తూ ఓ ఇంటికి వాచ్‌మెన్‌గా పని చేస్తుంటాడు. అదే ఇంట్లో ఇంటర్ చదువుతున్న జాబిలి (శ్రీదేవి) తో ప్రేమలో పడతాడు. అయితే ఈ విషయం ఇంట్లో తెలిసిపోవడంతో మంగపతి (శివాజీ) కోపంతో రగిలిపోతాడు. అతను చందుపై పోక్సో చట్టంతో పాటు ఇతర కఠినమైన సెక్షన్ల కింద కేసు పెడతాడు. ఏ తప్పూ చేయని చందు జీవితంలో ఈ ఘటన ఎలా ప్రభావం చూపింది? తేజ (ప్రియదర్శి) అనే జూనియర్ లాయర్‌ తన క్లయింట్‌ కోసం ఎంత దూరం వెళ్లాడు? చివరకు న్యాయ పోరాటం ఫలించిందా? అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Tags:    

Similar News