Pushpa: పుష్ప ఐటెమ్ సాంగ్‌లో ఫస్ట్ ఆప్షన్ సమంత కాదా.? మరెవరో తెలుసా.?
Pushpa: అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఏ రేంజ్‌లో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Pushpa: పుష్ప ఐటెమ్ సాంగ్‌లో ఫస్ట్ ఆప్షన్ సమంత కాదా.? మరెవరో తెలుసా.?
Pushpa: అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఏ రేంజ్‌లో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సిరీస్ నుంచి వచ్చిన రెండు చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక మొదటి పార్ట్‌లో వచ్చిన 'ఊ అంటావా?' పాట ఎంతటి పాపులారిటీని సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈ పాటలో సమంత తన అందచెందాలతో కట్టిపడేసింది. అయితే పుష్ప ఈ సాంగ్ కోసం మొదట అనుకుంది సమంతను కాదనే విషయం మీకు తెలుసా.? అవును ఈ విషయాన్ని తాజాగా నిర్మాత అధికారికంగా ప్రకటించారు. రాబిన్‌హుడ్‌లో స్పెషల్ సాంగ్‌తో ఆకట్టుకున్న కేతికశర్మను తొలుత పుష్ప కోసం అనుకున్నట్లు నిర్మాత తెలిపారు. నితిన్ - వెంకీ కుడుముల కాంబోలో రానున్న చిత్రం ‘రాబిన్ హుడ్’ మార్చి 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగానే నిర్మాత రవిశంకర్ ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. 'అది దా సర్‌ప్రైజ్' పాటతో కేతికశర్మ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని చెప్పుకొచ్చారు. ‘పుష్ప’లో ఐటమ్ సాంగ్ కోసం సమంత కంటే ముందు కేతికను కలవాలనుకున్నామని కానీ, అప్పుడు మిస్ అయ్యామన్నారు.
ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్లకు ఆమెతో పనిచేసే అవకాశం వచ్చిందని, ఈ సినిమాలో కేతిక నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇక శ్రీలీల చాలా బిజీగా ఉండి కూడా తేదీలు సర్దుబాటు చేసుకొని ఇందులో నటించారు అని చెప్పుకొచ్చారు. కాగా మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మికను అనుకున్నారంటా.. కానీ డేట్స్ అడ్జెట్స్‌మెంట్ కాకపోవడంతో ఆమె ఈ సినిమాలో నటించలేదు.