Tollywood: ఇండియాలో ఆ కాన్సెప్ట్‌తో వస్తున్న తొలి చిత్రం.. మరీ ఇంత బోల్డ్‌ ఏంటి సామీ

Tollywood: మారిన కాలంతో పాటు సినిమాల శైలి కూడా మారుతోంది. ముఖ్యంగా యువతను టార్గెట్‌ చేసుకొని సినిమాలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్‌. ఒకప్పుడు మాట్లాడానికే ఇబ్బందిగా ఉండే అంశాలను ఇతి వృత్తంగా చేసుకొని సినిమాలుగా తీస్తున్నారు.

Update: 2025-03-23 08:00 GMT
Poornachandra Rao Indias First Film on Porn Addiction Sparks Bold New Trend in Tollywood

Tollywood: ఇండియాలో ఆ కాన్సెప్ట్‌తో వస్తున్న తొలి చిత్రం.. మరీ ఇంత బోల్డ్‌ ఏంటి సామీ

  • whatsapp icon

Tollywood: మారిన కాలంతో పాటు సినిమాల శైలి కూడా మారుతోంది. ముఖ్యంగా యువతను టార్గెట్‌ చేసుకొని సినిమాలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్‌. ఒకప్పుడు మాట్లాడానికే ఇబ్బందిగా ఉండే అంశాలను ఇతి వృత్తంగా చేసుకొని సినిమాలుగా తీస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ సినిమానే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో తొలిసారి పోర్న్‌ అడిక్షన్‌ అనే డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమా పేరు పూర్ణ చంద్రరావు.

ఈ సినిమా తారక రామ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా హీరో విజయ్ రాజ్ కుమార్ ‘ఏం చేస్తునావ్’ అనే సినిమా ఇదువరుకే తీశారు. ఇప్పుడు 'పూర్ణ చంద్రరావు' లో హీరో గా నటిస్తున్నారు. అంతే కాదు ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ని రాసిన రైటర్ కూడా ఈయనే. కాగా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది. సోఫా మీద అర్ధనగ్నంగా కూర్చొని ల్యాప్‌టాప్ చూస్తున్న హీరో, వెనుక స్టీవ్ జాబ్స్, ఎలాన్ మస్క్ ఫోటోలు – ఇవన్నీ కలిపి ప్రేక్షకులకు ఓ మెసేజ్ ఇస్తున్నాయి. టెక్నాలజీ, పోర్న్ అడిక్షన్, మానసిక స్థితి అన్నీ కలిపి ఓ డీప్ అర్ధం చెప్పేలా ఉంది.

సాధారణంగా అడిక్షన్‌ అంటే కేవలం మద్యం, డ్రగ్స్‌ మాత్రమే అనుకుంటాం. అయితే డిజిటల్‌ విప్లవం పెరిగిన ప్రస్తుత తరుణంలో పోర్న్ అడిక్షన్ కూడా పెరిగిందన్న అంశాన్ని మేకర్స్‌ ఈ సినిమాలో ప్రస్తావించినట్లు స్పష్టమవుతోంది. 'అనగనగా ఆస్ట్రేలియా లో' సినిమాతో కొత్తగా ట్రై చేసిన తారక రామ, ఇప్పుడు మరింత బోల్డ్ కథనాన్ని ఎంచుకున్నారు. హీరో కూడా తన సొంత అనుభవాలను ఆధారంగా చేసుకుని ఈ కథ రాశానని తెలిపారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. కొందరు ఈ ఫస్ట్‌ లుక్‌పై విమర్శిస్తుండగా, మరికొందరు మాత్రం ఈ కాలంలో ఇలాంటి సినిమాలు అవసరమని అంటున్నారు. సహాన ఆర్ట్ క్రియేషన్స్ పై మాధవి మంగపతి, యారీక్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంత బొల్డ్ కాన్సెప్ట్ పై సినిమా రావాలంటే చాలా ధైర్యం చేయాలి. ఒక పోస్టర్ తోనే అందరిని ఆకట్టుకున్న ఈ 'పూర్ణ చంద్రరావు' ముందు ముందు ఇంకేం చేస్తాడో చూడాలి మరి.

Tags:    

Similar News