Pushpa 2: పుష్ప2 కోసం అల్లు అర్జున్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం
Pushpa 2: డిసెంబర్ 5వ తేదీన పుష్ప 2 మూవీ విడుదలయ్యింది. ఈ మూవీ మరో రికార్డ్ బద్దలు కొట్టింది. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ తొలిరోజే భారీ వసూళ్లను రాబట్టి సంచలనం క్రియేట్ చేసింది. పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే పుష్ప 1 లో అల్లు అర్జున్ పాత్ర పుష్ప కూలీగా జీవితాన్ని ప్రారంభించడం, స్మగ్లింగ్ ముఠాకు నాయకుడు అయ్యే వరకు ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన పుష్ప 2లో అసలు కథను చక్కగా చూపించాడు సుకుమార్. పుష్ప ది రైజ్ అల్లు అర్జున్, రష్మిక , ఫహద్ ఫాజిల్, సునీల్, అజయ్ ప్రధానంగా నటించారు.
ఈ మూవీ 2021లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్నిఅందించారు. మామూలుగా డాన్ గ్యాంగ్ స్టర్ సినిమాల్లో కనిపించే కథే అయినప్పటికీ ఈ మూవీలో అల్లు అర్జున్ యాక్షన్ మ్యానరిజమ్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది.
ఈ మూవీ విడుదలకు ముందే ప్రీ బుకింగ్ లో 100కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. తొలిరోజు వసూళ్ల విషయానికొస్తే ఈ మూవీ 175కోట్ల వరకు వసూలు చేసిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాలో నటించిన నటీనటుల పారితోషికం ఎంత అనేది ఇంటర్ నెట్ లో వైరల్ అవుతోంది.
ఈ మూవీలో నటించినందుకు హీరో అల్లు అర్జున్ 300కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. దర్శకుడు సుకుమార్ 15కట్లు ,రష్మిక మంధాన 10కోట్లు, నటుడు ఫహద్ ఫాజిల్ 8కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నారు. దేవీశ్రీ ప్రసాద్ 5కోట్లు,స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీల 2 కోట్లు అందుకున్నారని సమాచారం.