అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయింది అంటున్న "సైరా" డైరెక్టర్
Director Surender Reddy: సినిమాలను సైతం స్టైలిష్గా తెరకెక్కించ గల సత్తా ఉన్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి.
Director Surender Reddy: సినిమాలను సైతం స్టైలిష్గా తెరకెక్కించ గల సత్తా ఉన్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ధ్రువ, సైరా నరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ లను ప్రేక్షకులకు అందించిన సురేందర్ రెడ్డి తాజాగా ఇప్పుడు అక్కినేని అఖిల్ హీరోగా "ఏజెంట్" అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు చూస్తే ఈ సినిమాకి కూడా సురేందర్ రెడ్డి మార్క్ స్క్రీన్ ప్లే ఉండబోతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అభిమానులు కూడా ఈ సినిమాతో కచ్చితంగా ఒక మంచి హిట్ ని అందుకుంటాడు అని అభిమానులు భావిస్తున్నారు. గతంలో సురేందర్ రెడ్డి ఎన్.టి.ఆర్ హీరోగా అశోక్ మరియు ఊసరవెల్లి అనే సినిమాలను తెరకెక్కించారు.
ఎన్టీఆర్ రెండు సార్లు అవకాశం ఇచ్చినప్పటికీ ఆ రెండు సార్లు సురేందర్రెడ్డి తన పేరు నిలబెట్టుకోలేక పోయారు. ఆ తర్వాత మహేష్ బాబుతో చేసిన "అతిథి" సినిమా, రవితేజ తో "కిక్ 2" కూడా డిజాస్టర్లుగా మారాయి. ఆ సమయంలో సురేందర్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను డిజాస్టర్ సినిమాలను తెరకెక్కించలేదని తన సక్సెస్ రేటు 70% ఉందని చెప్పారు. "అతిధి ఫ్లాప్ అయిన సమయంలో చాలా బాధపడ్డాను. కిక్ 2 సినిమా టైటిల్ విషయంలో తప్పు చేశాను. దాని వల్లే సినిమా ఫ్లాప్ అయింది. సినిమా చాలా బాగుండి కూడా ఫ్లాప్ అయిందని బాధపడింది ఊసరవెల్లి కే" అని చెప్పుకొచ్చారు సురేందర్రెడ్డి. ఇప్పటిదాకా తన కెరీర్ లో రాసిన బెస్ట్ స్క్రిప్ట్ ఉసరవెల్లి అని అన్నారు సురేందర్.