రామ్‌చరణ్‌, బుచ్చిబాబు సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఆర్‌సీ16 వర్కింట్‌ టైటిల్‌తో ఈ సినిమాను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రారంభించినట్లు ఇప్పటికే ప్రకటన చేసింది.

Update: 2024-06-20 13:30 GMT
Director buchi babu interesting comments about RC16 Movie

రామ్‌చరణ్‌, బుచ్చిబాబు సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

  • whatsapp icon

ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. తొలిసినిమాతోనే మంచి విజయాన్ని సంపాదించుకుని స్టార్ డైరెక్టర్ రేంజ్‌కి జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్లాడు. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన బుచ్చిబాబు తొలిసినిమాతోనే తన ట్యాలెంట్‌ను చూపించుకున్నాడు.

ఇదిలా ఉంటే రెండో సినిమానే ఏకంగా రామ్‌ చరణ్‌ను డైరెక్ట్ చేసే లక్కీ ఛాన్స్‌ కొట్టేశాడు. రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఆర్‌సీ16 వర్కింట్‌ టైటిల్‌తో ఈ సినిమాను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రారంభించినట్లు ఇప్పటికే ప్రకటన చేసింది. అయితే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.

విజయ్‌ సేతుపతి నటించిన తాజా చిత్రం.. మహారాజ ఇటీవల విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దర్శకుడు బుచ్చిబాబు ఇటీవల మహారాజ చిత్రబృందాన్ని ఇంటర్వ్యూ చేశారు. ఈసందర్భంగా ‘RC16’ గురించి విజయ్‌ కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ సినిమా స్టోరీ ఎంతో బాగుందన్న విజయ్‌, బుచ్చిబాబును ప్రశంసించారు. తనకు సినిమా స్టోరీ మొత్తం తెలుసని, ఈ సినిమా కచ్చితంగా సూపర్‌ హిట్‌ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్‌ ఆగస్టు నుంచి ప్రారంభించనున్నట్లు దర్శకుడు బుచ్చి బాబు తెలిపారు. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్‌ను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. చిత్రీకరణ ప్రారంభంకాగానే దీనికి సంబంధించి ఓ అధికారిక ప్రకటన రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చెర్రీకి జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ నటిస్తున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News