చచ్చిపోదామనుకున్న ఈయన 'సముద్ర'మంత వినోదాన్ని పంచుతున్నారు!

విధి విచిత్రమైనది. ఎప్పుడు ఎవరికీ ఎలాంటి స్థితి కల్పిస్తుందో ఎవరూ చెప్పలేరు. ముఖ్యంగా సినిమా పరిశ్రమను నమ్ముకున్నవారి విషయంలో ఎవరు ఎప్పుడు ఎలా మారతారో ఊహించడం కూడా కష్టం.

Update: 2021-01-17 08:31 GMT

క్రాక్ సినిమాలో సముద్రఖని 

విధి విచిత్రమైనది. ఎప్పుడు ఎవరికీ ఎలాంటి స్థితి కల్పిస్తుందో ఎవరూ చెప్పలేరు. ముఖ్యంగా సినిమా పరిశ్రమను నమ్ముకున్నవారి విషయంలో ఎవరు ఎప్పుడు ఎలా మారతారో ఊహించడం కూడా కష్టం. కానీ, తాను నమ్ముకున్న.. తాను ఇష్టపడిన పని కోసం తపన పడిన వారు తప్పనిసరిగా ఎదోఒక రోజు విజయాన్ని అందుకుంటారు. ఆ విజయశిఖరం చేరాకా వెనక్కి తిరిగి చూసుకుంటే.. కష్టాల కొలిమిలో ఉన్నపుడు తాను తీసుకున్న నిర్ణయాలు ఎంత తప్పో అర్ధం అవుతుంది. క్షణికమైన ఆ ఆలోచనల్ని అధిగామించాడంతో తాము పొందిన జీవితాన్ని చూసుకున్నపుడు కచ్చితంగా సిగ్గు పడతారు. అటువంటిదే దర్శక నటుడు సముద్ర ఖని కథ!

మొన్నామధ్య వచ్చిన త్రివిక్రమ్ బన్నీల బ్లాక్ బస్తర్ మూవీ అల వైకుంఠపురములో.. సినిమాలో విలన్ గా కనిపించిన సముద్రఖని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన రవితేజ క్రాక్ సినిమాలో కిర్రాక్ విలన్ గా చేశారు. క్రాక్ సినిమాలో సముద్రఖని నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ పాత్రలో అయన తప్ప మరొకరిని ప్రస్తుతం ఊహించాను కూడా ఊహించలేం. ఇప్పుడు విలన్ గా అందర్నీ మెప్పిస్తున్న సముద్రఖని నిజానికి దర్శకుడిగా..రచయితగా తమిళ ఇండస్ట్రీలో టాప్ లో ఉండేవారు. దర్శకుడిగా చాలా విజయాలు అయన ఖాతాలో ఉన్నాయి. ఇప్పుడు తెలుగు నాట సరేసరి. సముద్రఖని అందరికీ తెలిసిన పేరు.

ఇంత సక్సెస్ వెనుక ఎంతో కష్టం ఉందని అయన స్వయంగా చెప్పారు. ఈమధ్య క్రాక్ సినిమా సక్సెస్ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో అయన తన జీవితంలోని చేదు అనుభవాల్ని వివరించారు.

సముద్రఖని సినిమా అవకాశాల కోసం చెన్నై వచ్చిన సమయంలో మరో ఇద్దరితో కలిసి ఒక రూమ్ లో ఉండేవారట. ఆ సమయంలో ఆయనకు తినడానికి కూడా తిండి ఉండేది కాదట. చాలా ఇబ్బందులు పాడుతుండే వారు. చెప్పులు లేక ఎక్కడికి వెళ్ళినా వట్టి కాళ్ళతో వెళ్ళేవారు. సినిమా అవకాశాల కోసం చెప్పులు అరిగేలా కాకుండా కాళ్ళు అరిగేలా తిరిగేవారు. ఒకసారి ఒక సినిమా అవకాశం కోసం ఒకర్ని కలవడానికి వెళ్ళాల్సి వచ్చిందాయనకు. ఆ సమయంలో తన రూమ్ లో ఉన్న మిత్రుడు బాత్రూం లో వాడుకునే చెప్పులు వేసుకుని బయటకు వెళ్ళడానికి బయలు దేరారట సముద్రఖని. అయితే, ఆ మిత్రుడు అందుకు అంగీకరించక పోగా, సముద్రఖనిని తీవ్రంగా అవమానించాడు. దీంతో చేసేదేం లేక ఆయన అలానే నడుచుకుంటూ రోడ్దేక్కారట, ఆ సమయంలో ఆ అవమానానికి చచ్చిపోదామని నిర్ణయించుకుని ఆ ప్రయత్నమూ మొదలు పెట్టారట సముద్రఖని. అయితే, రోడ్డు మీద బైక్ పై వెళుతున్న ఒకాయన నడుస్తూ వెళుతున్న సముద్రఖని ని చూసి లిఫ్ట్ ఇచ్చారు. దారిలో ఈయన కథ విని బాగా బ్రెయిన్ వాష్ చేశారు. చావు వైపు వెళ్ళిన సముద్ర ఆలోచనల్ని సక్రమంగా మార్చారు. ఆతరువాత మూడురోజులకు సముద్రఖనికి ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం వచ్చింది. దానికోసం తొలి పారితోషికంగా 100 రూపాయలు వచ్చాయి. వాటితో మూడు జతల చెప్పులు కొన్నారట సముద్రఖని. అదేవిధంగా ఇప్పటికీ తాను ఎక్కువ డబ్బులు చెప్పులు..షూల కోసం ఖర్చు చేస్తుంటానని సముద్ర్ఖ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

చూశారా కష్టంలో చనిపోవాలని నిర్ణయం తీసుకున్న సముద్ర ఆరోజు ఒక వ్యక్తి చెప్పిన మాటలకు ఆలోచనలో పడక పోయి ఉంటె...అదే జీవితం. చావుతో పరిష్కారం దొరకదు. సముద్రఖని జీవితం నిజంగానే అందరికీ మంచి పాఠం.

Tags:    

Similar News