మాట నిలబెట్టుకుంటున్న దిల్ రాజు

మాట నిలబెట్టుకుంటున్న దిల్ రాజు

Update: 2022-07-12 16:00 GMT

మాట నిలబెట్టుకుంటున్న దిల్ రాజు

Dil Raju: ఈ మధ్యకాలంలో థియేటర్లలో విడుదలైన మూడు నాలుగు వారాలకి కొన్ని సినిమాలు ఓటీటీ లలో ప్రత్యక్షమవుతున్నాయి. ముఖ్యంగా మీడియం రేంజ్ సినిమాలు రెండు మూడు వారాల్లోనే విడుదల అయిపోతుండగా స్టార్ హీరోల సినిమాలు మాత్రం కరెక్ట్ గా నెల తిరగగానే ఓటీటీ లలో ఉంటున్నాయి. కానీ ఇలాంటి పరిస్థితులలో అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన "ఎఫ్ 3" సాధారణ టికెట్ రేట్ల తో విడుదల చేయడానికి దిల్ రాజు ముందుకు వచ్చారు.

మొదటి వారాంతంలో కలెక్షన్లు తగ్గుముఖం పట్టగా ఈ సినిమా రెండు మూడు వారాల్లోనే ఓటీటీ ల్లో వచ్చేస్తుంది అంటూ పుకార్లు గుప్పుమన్నాయి. కానీ అనిల్ రావిపూడి "ఎఫ్ త్రీ" సినిమా ఎనిమిది వారాల తరువాత మాత్రమే ఓటీటీ లో వస్తుందని ఈ లోపు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎర్లీగా స్ట్రీమ్ కాదని స్పష్టం చేశారు. అనుకున్న ప్రకారం గానే 50 రోజుల తర్వాత సినిమాని స్ట్రీమ్ చేస్తామని దిల్ రాజు కూడా మాటిచ్చారు.

ఇప్పుడు అదే మాటని నిలబెట్టుకుంటూ ఎఫ్ త్రీ సినిమా థియేటర్లలో విడుదలైన 50 రోజుల తరువాతే ఈ సినిమాని స్ట్రీమ్ చేయనున్నారు. "ఎఫ్ త్రీ" సినిమా జూలై 22న నుంచి ఓటీటీ లలో స్ట్రీమ్ కాబోతోంది. మరోవైపు పుష్ప, రాధే శ్యామ్, ఆచార్య, సర్కారు వారి పాట (పే పర్ వ్యూ), విరాటపర్వం, అంటే సుందరానికి వంటి సినిమాలు విడుదలైన నెల తిరగకాకముందే ఓటీటీ లలోకి వచ్చేసాయి.

Tags:    

Similar News