"బాహుబలి" ప్రాఫిట్ కంటే రెండు డిజాస్టర్ ల నష్టం ఎక్కువ," అంటున్న దిల్ రాజు

Dil Raju:"డిస్ట్రిబ్యూషన్ నరకం," అంటున్న ప్రముఖ నిర్మాత

Update: 2023-04-09 14:00 GMT

"బాహుబలి" ప్రాఫిట్ కంటే రెండు డిజాస్టర్ ల నష్టం ఎక్కువ," అంటున్న దిల్ రాజు 

Dil Raju: ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఎంతోమంది స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించిన దిల్ రాజు నిర్మాతగా మాత్రమే కాక డిస్ట్రిబ్యూటర్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. చాలా వరకు తాను నిర్మించిన సినిమాలను నైజాం ఏరియాలో తానే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉంటారు దిల్ రాజు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డిస్ట్రిబ్యూషన్ గురించి మరియు సినిమా నిర్మాణం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

సినిమా నిర్మించడం కంటే డిస్టిబ్యూషన్ చేయటం చాలా కష్టమని అన్న దిల్ రాజు రెండిటిలో ఉండే ప్రాఫిట్ మరియు లాస్ట్ పర్సంటేజ్ ల గురించి కూడా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. "డిస్ట్రిబ్యూషన్ చేయటం నిజంగా చాలా నరకం. డిస్ట్రిబ్యూషన్ లో వచ్చే ప్రాఫిట్ ల కంటే లాస్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది.

కేవలం స్పైడర్ మరియు అజ్ఞాతవాసి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల నాకు కలిగిన నష్టం 25 కోట్లు. కానీ బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల వచ్చిన ప్రాఫిట్ 10 కోట్లు మాత్రమే," అని చెప్పుకొచ్చారు దిల్ రాజు. అయినా ఒకవైపు సినిమా నిర్మాణం చేస్తూనే డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తానని అంటున్నారు దిల్ రాజు. ప్రస్తుతం దిల్ రాజు స్టార్ బ్యూటీ సమంత నటిస్తున్న "శాకుంతలం" మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న "గేమ్ చేంజర్" సినిమాలు నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News