ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ఆదివారం రాత్రి రెండో వివాహం చేసుకున్నారు. నిజామాబాద్‌లోని స్వగ్రామంలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం రాత్రి 11:30 గంటలకు దిల్ రాజు వివాహం జరిగింది. అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో అత్యంత నిరాడంబంరంగా ఈ పెళ్లి జరిగింది. మూడేళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత అనారోగ్యంతో 2017లో మరణించింది. 'దిల్' రాజు వివాహం చేసుకున్నది వాళ్ల బంధువుల అమ్మాయినే అని తెలుస్తుంది. ఈమె ఎయిర్‌హోస్టెస్‌గా కూడా చేసినట్టు సమాచారం. తాజాగా దిల్ రాజు పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.