Deva Katta: బాహుబలి సిరీస్ పై క్లారిటీ ఇచ్చిన దేవకట్టా
* దేవ కట్టా మరియు ప్రవీణ్ సత్తారు ఈ వెబ్ సిరీస్ కి స్క్రిప్టు అందించారు
Deva Katta: డిజిటల్ దిగ్గజం అయిన నెట్ఫ్లిక్స్ ఇప్పుడు బాహుబలి వెబ్ సిరీస్ ను త్వరలో విడుదల చేయడానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన పనులు ఎప్పుడు మొదలయ్యాయి అనే దాని గురించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో "బాహుబలి" వెబ్ సిరీస్ క్యాన్సిల్ అయినట్లు పుకార్లు బయటకు వచ్చాయి.
దేవ కట్టా మరియు ప్రవీణ్ సత్తారు ఈ వెబ్ సిరీస్ కి స్క్రిప్టు అందించారు. తాజాగా తన తదుపరి సినిమా అయిన రిపబ్లిక్ చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న దేవకట్టా బాహుబలి సిరీస్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు.
బాహుబలి సిరీస్ ని మేము హాలీవుడ్ "గేమ్ ఆఫ్ థ్రోన్స్" రేంజ్లో తీద్దామని అనుకున్నాము. గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్క్రిప్ట్ కోసం పదేళ్లు వెచ్చించారు. స్క్రీన్ ప్లే కోసం 10 నుంచి 15 ఏళ్లపాటు కష్టపడ్డారు రైటర్లు. చాలా వర్షన్స్ క్యాన్సిల్ అయిన తరువాత సిరీస్ విడుదలైంది. బాహుబలి సిరీస్ కి కూడా అంతే ఎనర్జీ మరియు రిసోర్సెస్ కావాలి.
అది ఒక చిన్న ప్రాజెక్ట్ కాదు. ఇంతకుముందు నెట్ ఫ్లిక్స్ దీనిని త్వరగా పూర్తి చేయాలని అనుకుంది. కానీ ఇప్పుడు మా విజన్ కి గౌరవం ఇచ్చి మేము అనుకున్న టైం కంటే పది రెట్లు ఎక్కువగానే ఇవ్వడానికి సిద్ధమయ్యారు. దానికి స్క్రిప్ట్ వర్క్ ఇంకా జరుగుతుంది," అని క్లారిటీ ఇచ్చారు దేవకట్టా.