Deepika: కూతురుకు నామకరణం చేసిన స్టార్‌ కపుల్‌.. ఇంతకీ పేరు ఏంటో తెలుసా.?

Deepika: బాలీవుడ్‌ స్టార్‌ కపుల్స్‌లో దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ ఒకరు. ‘రామ్ లీలా’ సినిమాలో తొలిసారి కలిసి నటించిన ఈ జంట.. ఆ సమయంలోనే ప్రేమలో పడ్డారు.

Update: 2024-11-02 05:56 GMT

Deepika: బాలీవుడ్‌ స్టార్‌ కపుల్స్‌లో దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ ఒకరు. ‘రామ్ లీలా’ సినిమాలో తొలిసారి కలిసి నటించిన ఈ జంట.. ఆ సమయంలోనే ప్రేమలో పడ్డారు. కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న ఈ జంట ఆ తర్వాత 2018లో పెద్దల సమక్షంతో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లికి ముందు కూడా కొన్ని సినిమాల్లో కలిసి నటించారు.

ఇదలా ఉంటే ఇటీవల ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ కొట్టేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 8వ తేదీన ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దీపిక పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ ముందు వరకు దీపికా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దీపికా నటించిన చివరి చిత్రం 'కల్కి' ప్రమోషన్స్లో కూడా దీపికా పాల్గొంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ క్యూట్ కపుల్స్‌  తమ చిన్నారికి నామకరణం చేశారు. పాపకు ఈ జంట దువా పుదుకొణె సింగ్ అనే పేరు పెట్టారు. దువా అంటే ప్రార్థన అని అర్థం. తమ ప్రేయర్స్‌కి సమాధానమే మా గారాల పట్టి. ఇప్పుడు మా హృదయాలు ప్రేమతో నిండిపోయని అనే అర్థం వచ్చేలా దీపికా ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. చిన్నారి కాళ్లను ఫొటో తీసి అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. దువాకు విషెస్‌ చెబుతూ పెద్ద ఎత్తున కామెంట్స్‌ చేస్తున్నారు. 


Tags:    

Similar News