Dakshina Movie: సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తోన్న 'దక్షిణ'.. ఘనంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

Dakshina Movie: మంత్ర , మంగళ సినిమాలతో తెలుగు చలన చిత్ర రంగంలో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ఓషో తులసిరామ్ మళ్ళీ "దక్షిణ " మూవీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు .

Update: 2024-09-29 15:30 GMT

Dakshina Movie: సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తోన్న 'దక్షిణ'.. ఘనంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

Dakshina Movie: మంత్ర , మంగళ సినిమాలతో తెలుగు చలన చిత్ర రంగంలో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ఓషో తులసిరామ్ మళ్ళీ "దక్షిణ " మూవీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు . కల్ట్ కాన్సెప్ట్స్ బ్యానర్ నిర్మాణంలో అశోక్ షిండే నిర్మాత గా కబాలి ఫేమ్ సాయి ధన్షిక హీరోయిన్‌గా మహాభారత్ మర్డర్స్ ఫేమ్ రిషవ్ బసు మరొక ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఆదివారం గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు నటుడు శివాజి, ఆర్పి.పట్నాయక్ ముఖ్య అథితులుగా హాజరయ్యారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరమైన శివాజీ మాట్లాడుతూ.. 'మంత్ర సినిమాతో సంచలన విజయం సాధించిన దర్శకులు ఓషో తులసీరామ్. అప్పట్లోనే ఆ సినిమా పది కోట్లకు పైన వసూలు చేసింది. ఓషో తులసీరామ్ గారి సినిమాల్లో పాత్ర పడితే అదృష్టం అని చెప్పాలి. మంచి నిర్మాత దొరికితే గొప్ప సినిమాలు చెయ్యగల సత్తా ఉన్న దర్శకుడు ఓషో. మంచి కాన్సెప్ట్ తో వస్తోన్న సినిమా దక్షిణ, ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమా తరువాత ఓషో తులసీరామ్ గారు మరిన్ని మంచి సినిమాలు చేస్తారని ఆశిస్తున్నాను' అని చెప్పుకొచ్చారు.

ఇక దర్శకుడు ఓషో తులసీరాం మాట్లాడుతూ.. 'నాకోసం దక్షిణ సినిమాను సపోర్ట్ చెయ్యడానికి వచ్చిన శివాజీ గారికి కృతజ్ఞతలు. నాకు శివాజీ గారికి మంత్ర సినిమా సమయంలో ఎన్నో మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. ఒక మంచి నటుడు అంతకంటే మంచి మనిషి శివాజీ.మ్యూజిక్ డైరెక్టర్ బాలాజీ, వెలిగొండ శ్రీనివాస్ రైటర్, ఈ సినిమాకు బెస్ట్ వర్క్ చేశారు, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అశోక్ ఈ సినిమాకు నిర్మాత, సినిమా పట్ల విపరీతమైన ఆసక్తి, మేమిద్దరం కలిసి దక్షిణ సినిమాను ఇంకా బెస్ట్ ఔట్ ఫుట్ కు తీసుకురాగలిగాం, సాయి ధన్సిక చాలా పర్ఫెక్ట్ గా నటించింది, ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నా'మని తెలిపారు.

హీరోయిన్‌ సాయి ధన్సిక మాట్లాడుతూ.. సొసైటీలో ఉన్న అమ్మాయిలు అందరూ స్ట్రాంగ్ గా ఉండానే పాయింట్‌ను దక్షిణ సినిమాలో చెప్పామన్నారు. ఓషో తులసీరామ్ తనకు ఈ స్టొరీ చెప్పినప్పుడు షాక్ అయ్యాను, ఆశ్చర్య పోయానని చెప్పుకొచ్చింది. సినిమా చాలా గ్రిప్పింగ్‌గా ఉందని, ఈ సినిమాకు సపోర్ట్ చేస్తున్న అందరికి ధన్యవాదాలు చెప్పుకొచ్చారు. మరి మంచి అంచనాల నడుమ వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News