Vijay Deverakonda: "లైగర్" కలెక్షన్లు 200 కోట్ల నుంచి మొదలవుతాయి..
కలెక్షన్ల గురించి మరొక ఆసక్తికరమైన కామెంట్ చేసిన విజయ్ దేవరకొండ
Vijay Devarakonda: వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న యువహీరో విజయ్ దేవరకొండ తాజాగా ఇప్పుడు "లైగర్" సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఆగస్టు 25న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు ఓవర్సీస్ లో కూడా సినిమా టికెట్లు హాట్ కేకులలా అమ్ముడుబోతున్నాయి.
చిత్ర బృందం కూడా ప్రమోషన్స్ తో చాలా బిజీగా ఉంది. విజయ్ దేవరకొండని వెండి తెరపై చూసి ఇప్పటికీ రెండేళ్లు కావడంతో అభిమానులు కూడా చాలా ఆసక్తిగా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి విజయ్ దేవరకొండ ఎలాగైనా మంచి హిట్ అందుకుంటారని చిత్ర బృందంతో పాటు అభిమానులు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
ఇక విజయ్ దేవరకొండ కూడా పలు సందర్భాల్లో మాట్లాడుతూ "లైగర్" సినిమా కలెక్షన్లతో బాక్సాఫీస్ ను షేక్ ఆడిస్తుంది అని పలు ఆసక్తికరమైన కామెంట్లు చేయడంతో అభిమానులు కూడా సినిమాపై మంచి అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా కలెక్షన్ల కౌంటింగ్ 200 కోట్ల నుంచి మొదలవుతుంది అంటూ మరొక కాన్ఫిడెంట్ కామెంట్ చేశారు విజయ్ దేవరకొండ. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, హిందీ మరియు మలయాళం భాషల్లో కూడా విడుదల కాబోతోంది.