Hyderabad: ఫిల్మ్ ఫెడరేషన్ ముట్టడించిన సినీ కార్మికులు

హైదరాబాద్‌‌లోని ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫీస్‌ వద్ద కార్మికుల ఆందోళన

Update: 2022-06-22 07:13 GMT

ఫిల్మ్ ఫెడరేషన్ ముట్టడించిన సినీ కార్మికులు

Hyderabad: తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్‌ ముందు సినీ కార్మికుల ఆందోళనకు దిగారు. సమ్మెలో 24 క్రాఫ్ట్స్ కు చెందిన కార్మికులు పాల్గొన్నారు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కనీస వేతనం పెంచాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నామని అయితే ఇప్పటివరకు పట్టించుకోలేదని చెబుతున్నారు. మరోవైపు యూనియన్ల వారీగా ఫెడరేషన్‌ కార్యాలయానికి భారీగా తరలివస్తున్నారు కార్మికులు. కరోనా తర్వాత అన్ని రేట్లు పెరిగాయని.. కానీ కార్మికుడి జీతాలు మాత్రం పెరగలేదని వాపోతున్నారు.

నిబంధనల ప్రకారం ప్రతి మూడేళ్లకు ఒకసారి 24 క్రాఫ్ట్స్ కు చెందిన కార్మికుల జీతాలు పెంచాలి, కానీ ఈసారి నాలుగేళ్లయినా జీతాలు పెంచలేదు. ముఖ్యంగా కరోనా టైమ్‌లో ఎన్నో ఇబ్బందులు పడిన కార్మికులకు, జీతాలు పెంచుతామనే హామీ ఇచ్చి మరీ నిర్మాతలు తమ షూటింగ్‌లకు వాడుకున్నారని కార్మికులు మండిపడుతున్నారు. కానీ ఆ తర్వాత ఆ సంగతి మర్చిపోయారని 24 క్రాఫ్ట్స్ విభాగం కార్మికులు అంటున్నారు.

మరోవైపు సినీ కార్మికులు ఇలా అకస్మాత్తుగా సమ్మెకు వెళ్లడం ఏమాత్రం కరెక్ట్ కాదని ఫిలిం ఛాంబర్ అంటోంది. సమ్మెకు వెళ్లేముందు ఫిలిం ఛాంబర్‌కు నోటీసులు ఇవ్వాలని అలా చేయకుండా నేరుగా సమ్మెకు దిగడం ఏమిటని ఫిలిం ఛాంబర్ ప్రశ్నిస్తుంది. అయితే తాము ఇప్పటికే నోటీసులు ఇచ్చామని.. అయినా కూడా ఫిలిం ఛాంబర్ తమ మనవిని పెడచెవిన పెట్టిందని అందుకే ఇప్పుడు సమ్మెకు పిలుపునిచ్చామని కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు. 

Full View


Tags:    

Similar News