Viswambhara: దసరా పండుగకు మెగా ఫ్యాన్స్‌కి మెగా ట్రీట్.. విశ్వంభర టీజర్ విడుదల చేసిన చిత్ర యూనిట్..

దసరా పండుగ రోడు మెగా ఫ్యాన్స్‌కు మెగా ట్రీట్ ఇచ్చారు. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ రిలీజ్ డేను ప్రకటించిన చిత్రయూనిట్..

Update: 2024-10-12 06:42 GMT

Viswambhara: దసరా పండుగకు మెగా ఫ్యాన్స్‌కి మెగా ట్రీట్.. విశ్వంభర టీజర్ విడుదల చేసిన చిత్ర యూనిట్..

దసరా పండుగ రోడు మెగా ఫ్యాన్స్‌కు మెగా ట్రీట్ ఇచ్చారు. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ రిలీజ్ డేను ప్రకటించిన చిత్రయూనిట్... చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న విశ్వంభర టీజర్‌‌ను విడుదలచేశారు. అందరూ ఎదురు చూస్తున్న అతని రాక..... ఓ వేడుక అంటూ చిత్రబృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. విశిష్ట దర్శకత్వంలో విజువల్ వండర్, సోషియో ఫాంటసీ త్రిల్లర్‌, యాక్షన్‌ అడ్వెంచర్‌ మువీగా విశ్వంభరను తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే చిత్ర షూటింగ్‌ పనులు ముగింపుకు వచ్చేశాయి. భారీ విజువల్ వండర్‌గా ఈ మువీని దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో యువీ క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందిస్తున్నారు. విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు ఈ మువీ నిర్మాతలు. జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ఇదే కావడం విశేషం.

మువీ టీజర్‌లో శ్వేత అశ్వంపై స్వారీ చేస్తున్న మెగాస్టార్ కనిపించారు. టీజర్‌ చూస్తున్నంత సేపు మరో ప్రపంచంలో ఉన్న ఫీలింగ్‌ కలుగుతుంది. ఈ మువీలో చిరంజీవి సరసన హీరోయిన్‌ త్రిష నటిస్తున్నారు. స్టాలిన్ తర్వాత చిరు, త్రిష కలిసి నటిస్తున్న మువీ ఇదే.

Full View


Tags:    

Similar News