Chiranjeevi: మేము 42% టాక్స్ కడుతున్నాము అంటున్న మెగాస్టార్

Chiranjeevi: టికెట్ రేట్ల పెంపుపై స్పందించిన చిరంజీవి

Update: 2022-04-27 08:41 GMT

Chiranjeevi: మేము 42% టాక్స్ కడుతున్నాము అంటున్న మెగాస్టార్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన తదుపరి సినిమా "ఆచార్య" ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 29న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన టికెట్ రేటు గురించి రియాక్ట్ అయ్యారు మెగాస్టార్. "కరోనా మహమ్మారి అన్ని ఇండస్ట్రీలు ఎఫెక్ట్ అయ్యాయి.

సినీ ఇండస్ట్రీ కూడా అందులో ఒక భాగమే. షూటింగ్ చాలా సార్లు వాయిదా పడ్డ వల్ల మా సినిమా బడ్జెట్ కూడా చాలా పెరిగింది. దానికోసం 50 కోట్లు వడ్డీ కింద ఇవ్వాల్సి వచ్చింది" అని చెప్పుకొచ్చారు చిరు. "50 కోట్లతో ఒక మీడియం రేంజ్ బడ్జెట్ తీయచ్చు. కానీ ప్రేక్షకులను అలరించడానికి, వారికి బెస్ట్ విజువల్స్ అందించడానికి మేము కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాము. అంత కష్టపడి సినిమా తీసినప్పుడు టికెట్ రేట్ కొంచెం పెంచమని ప్రభుత్వాన్ని కోరడంలో తప్పేం లేదు.

పైగా సినీ ఇండస్ట్రీలో మేమంతా 42% టాక్స్ కడుతున్నాం. దానిలో ఎంతో కొంత తిరిగి వస్తే బాగుంటుందని మాకు ఉంటుంది. నేను ముఖ్యమంత్రి జగన్ నా కోసం మాత్రమే అడగలేదు. కరోనా వల్ల చితికిపోయిన యావత్ సినీ ఇండస్ట్రీ కోసం రిక్వెస్ట్ చేశాను" అని అన్నారు మెగాస్టార్. ఈ నేపథ్యంలో అభిమానులు మెగాస్టార్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Tags:    

Similar News