రాజ్‌కుంద్రా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు
Raj Kundra: పోర్నోగ్రఫీ కేసులో ఊచలు లెక్కపెడుతున్న రాజ్‌కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
Raj Kundra: పోర్నోగ్రఫీ కేసులో ఊచలు లెక్కపెడుతున్న రాజ్‌కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా కుంద్రా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, తక్షణమే విడుదల చేయాలని కోరుతూ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా తన పిటిషన్ లో పేర్కొన్నారు. తన అరెస్ట్ కు ముందు నోటీసులు ఇవ్వలేదని, పైగా మేజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ ఆదేశాలు ఇచ్చిందని వివరించారు. అయితే, ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల్లో ఎలాంటి తప్పులేదని స్పష్టం చేసింది. రాజ్ కుంద్రాకు విధించిన రిమాండ్, జ్యుడిషియల్ కస్టడీ చట్టానికి లోబడే ఉన్నాయని, ఇందులో తాము జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులేమీ లేవని జస్టిస్ ఏఎస్ గడ్కరీ ధర్మాసనం స్పష్టం చేసింది.