Amitabh Bachchan Coronavirus Updates: త్వరలో అమితాబ్ బచ్చన్ డిశ్చార్జ్..
Amitabh Bachchan Coronavirus Recovering Updates: 12 రోజుల నుండి ముంబైలోని నానావతి ఆసుపత్రిలో కోవిడ్ -19 చికిత్స పొందుతున్న అమితాబ్ బచ్చన్ త్వరలో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని జీ న్యూస్ పేర్కొంది. అలాగే బిగ్ బి కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా డిశ్చార్జ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని. తండ్రి-కొడుకుల ద్వయం సంక్రమణ నుండి కోలుకుంటున్నట్లు ఆసుపత్రి వర్గాలు గురువారం తెలిపాయని తన వెబ్ సైట్ లో రాసింది. అయితే దీనిపై ఇంకా అధికారిక సమాచారం మాత్రం బయటికి రాలేదు. అమితాబ్ , అభిషేక్ ఉన్న వార్డులను శుభ్రపరచాల్సిందిగా సిబ్బందికి సమాచారం అందింది. ఈ క్రమంలో వారు మరో రెండు రోజులలో డిశ్చార్జ్ అవుతారని వార్త ప్రచారంలోకి వచ్చింది. దాంతో అభిమానులు కుదుటపడ్డారు.
కాగా జులై 12 న తమకు కరోనా వైరస్ సోకిందని, ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితిపై అభిషేక్ బచ్చన్ ట్వీట్ ద్వారా తెలియజేసిన సంగతి తెలిసిందే. అందులో తన తండ్రి మరియు తనకు కోవిడ్ పాజిటివ్ గా తేలిందని. తేలికపాటి లక్షణాలు ఉన్న ఇద్దరినీ ఆసుపత్రిలో చేర్పించారని పేర్కొన్నారు. అప్పుడు తాము అధికారులకు సమాచారం ఇచ్చామని.. కుటుంబసభ్యులు మరియు సిబ్బంది అందరూ పరీక్షలు చేయించుకున్నారని. BMC కూడా అండగా ఉందని పేర్కొన్నారు.. కరోనా భారిన పడిన ప్రతిఒక్కరు భయపడకుండా ప్రశాంతంగా ఉండాలని అభిషేక్ ట్వీట్ చేశారు.