Bollywood: వివాదంలో అలియా భట్ సినిమా
Bollywood: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నగూబాయ్ కథైవాడి చిత్రం వివాదంలో చిక్కుకుంది.
Bollywood: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నగంగూబాయ్ కథైవాడి చిత్రం వివాదంలో పడింది. ఈ సినిమాకు సంజయ్ లీలా బన్సానీ దర్శకత్వం వహిస్తున్నారు. వివరాల్లోకి వెళితే... ముంబయిలో మేడమ్ ఆఫ్ కామతిపుర(పేరు మోసిన రెడ్‌లైట్ ఏరియా) పేరును తెచ్చుకున్న గంగూబాయ్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో అలియా భట్ గంగూబాయ్ పాత్రలో సెక్స్ వర్కర్‌గా నటిస్తున్నారు.
టీజర్‌లో తప్పుగా చూపించారని ఆరోపణ...
మరో వైపు అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఆ మధ్యన ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ అవ్వగా.. అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాపై ముంబయిలోని కామతిపుర ప్రాంతం వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముంబయిలో ఈ ప్రాంతానికి రెడ్ లైట్ ఏరియాగా పేరుంది. 200 సంవత్సరాల చరిత్ర గలిగిన తమ ప్రాంతాన్ని టీజర్‌లో తప్పుగా చూపించారని వారు ఆరోపిస్తున్నారు.
సంజయ్ లీలా బన్సాలీకి కరోనా పాజిటివ్...
ఇదిలా వుండగా దర్శకుడు, నిర్మాత సంజయ్ లీలా భన్సాలీకి కూడా కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు బీ టౌన్ టాక్. ఇప్పటికే ఐసోలేషన్ లో ఉన్న సంజయ్ చికిత్స తీసుకుంటున్నారు. ఇక మరోవైపు 'గంగూభాయి' సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నఅలియా భట్ హోమ్ క్వారెంటైన్ లో ఉన్నారు. ఇప్పటికే రణబీర్ కపూర్ కు కరోనా సోకడంతో హోం క్వారంటైన్ లో వుండి ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే.