నా ప్రాణం ఉన్నంత వరకూ సహాయం చేస్తూనే ఉంటా : సోనూసూద్

సోనూసూద్ .. సహాయానికి నిలువెత్తు నిదర్శనం.. కరోనా వలన ఏర్పడిన లాక్ డౌన్ టైంలో వలసకూలీల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి వారిని వారివారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట దేవుడుగా నిలిచాడు..

Update: 2020-11-16 09:08 GMT

సోనూసూద్ .. సహాయానికి నిలువెత్తు నిదర్శనం.. కరోనా వలన ఏర్పడిన లాక్ డౌన్ టైంలో వలసకూలీల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి వారిని వారివారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట దేవుడుగా నిలిచాడు.. అంతటితో తన సేవలను ఆపడం లేదు.. కష్టం అనే మాట వస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు. పేద పిల్లలకు ఉచిత విద్య, స్కాలర్ షిప్ లు మరియు వైద్య సదుపాయాలను కూడా అందిస్తున్నాడు.. ఇలా సమస్య కనిపిస్తే చాలు అక్కడ సొల్యూషన్ లాగా కనిపిస్తున్నాడు.. దీనితో ఇప్పుడు ఎక్కడ చూసిన సోనూసూద్ పేరే వినిపిస్తోంది. సోనుసూద్ సేవలకి గాను ఇటివల ఐక్యరాజ్యసమితి (యుఎన్‌డిపి) ఎస్‌డిజి స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డుతో సత్కరించిన సంగతి తెలిసిందే.

ఇక ఇదిలా ఉంటే తాజాగా దీపావళి సందర్భంగా ఓ ఛానల్ లో ప్రసారం అయిన కార్యక్రమంలో సోనూసూద్ నుంచి సహాయం పొందిన వ్యక్తులు పాల్గొని తమ బాధలను పంచుకున్నారు. తమకి సహాయం చేసిన సోనూసూద్ ని ప్రశంసించారు. ఇక ఇదే కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు సోనూసూద్. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ఇంతమందికి సేవలను అందించడానికి తనకి తన అమ్మానాన్నలే స్ఫూర్తి అని అన్నారు సోనూసూద్. అయితే ప్రస్తుతం వాళ్లు తనతో లేనప్పటికీ తానూ చేసే పనులు చూసి గర్విస్తున్నారని ఆశిస్తున్నట్టుగా సమాధానం ఇచ్చాడు సోనుసూద్.

చిన్నప్పుడు నిజమైన సక్సెస్‌ అంటే.. ఒకరికి సాయం అవసరమైనప్పుడు వాళ్లు అడగకముందే వెళ్లి సాయం చేయడమేనని తన తల్లి చెప్పినట్టుగా సోనూసూద్ వెల్లడించారు. అయితే తానూ చేస్తున్న సహాయానికి నన్ను దేవుడితో పోల్చడం కరెక్ట్‌ కాదని అన్నారు. తానూ అందరిలాగే మామలు సాధారణమైన వ్యక్తినేనని, కాకపోతే కష్టాల్లో ఉన్నవారిని చూసినప్పుడు నాకెంతో బాధగా అనిపించేదని అన్నాడు. తన ప్రాణం పోయేంత వరకు సహాయం చేస్తూనే ఉంటానని సోనుసూద్ ఈ సందర్భంగా వెల్లడించాడు.

Tags:    

Similar News