Sonu Sood Offers Scholarship : పేద విద్యార్దులకు సోనూసూద్ స్కాలర్‌షిప్స్!
Sonu Sood Offers Scholarship : సోనూసూద్.. సహాయానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోతున్నాడు.. కష్టం అనే మాట వినిపిస్తే చాలు చలించిపోతున్నాడు.
Sonu Sood Offers Scholarship : సోనూసూద్.. సహాయానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోతున్నాడు.. కష్టం అనే మాట వినిపిస్తే చాలు చలించిపోతున్నాడు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ఓ సొల్యుషన్ లాగా కనిపిస్తున్నాడు. లాక్ డౌన్ సమయంలో చాలా మంది వలసకూలీలను వారి వారి స్వస్థలానికి చేర్చి వారి పాలిట దేవుడిగా నిలించాడు.. అంతటితో ఆగకుండా ఇంకా తనకి తోచిన సహాయం చేసుకుంటూ పోతున్నాడు. తాజాగా పేద విద్యార్దులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చాడు సోనూసూద్..
తాజాగా పేద విద్యార్దుల కోసం సోనూసూద్ ఓ ప్రత్యేక స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ ని రూపొందించాడు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అణగారిన విద్యార్దులకి స్కాలర్ షిప్ లు ఇస్తామని ప్రకటించాడు. వార్షికాదాయం రూ. 2 లక్షలు లోపు ఉన్న కుటుంబాలకి చెందిన, మెరుగైన ఉత్తిర్ణత సాధించిన విద్యార్దులు Scholarships@sonusood.me మెయిల్ కి పది రోజుల లోగు వివరాలు పంపాలని సోనూసూద్ వెల్లడించాడు. మెడిసిన్, ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఫ్యాషన్, జర్నలిజం, బిజినెస్ స్టడీస్ వంటి కోర్సులకు ఈ స్కాలర్‌షిప్ లభిస్తుంది.
దీనికి తన తల్లి ప్రొఫెసర్ సరోజ్ సూద్ పేరుతో స్కాలర్‌షిప్‌లను అందించడానికి దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు సోనుసూద్.. గతంలో సోనూసూద్ తల్లి పంజాబ్ లో ఉచితంగా బోధించేది. ఇప్పుడు ఆమె పనిని తానూ ముందుకు తీసుకువెళ్తూన్నట్టుగా సోనూసూద్ వెల్లడించాడు. సోనూసూద్ చేస్తున్న ఈ సహాయం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
हमारा भविष्य हमारी काबिलियत और मेहनत तय करेगी ! हम कहाँ से हैं , हमारी आर्थिक स्थिति का इस से कोई सम्बन्ध नहीं। मेरी एक कोशिश इस तरफ - स्कूल के बाद की पढ़ाई के लिए full scholarship - ताकि आप आगे बढ़ें और देश की तरक्की में योगदान दें। 🇮🇳
— sonu sood (@SonuSood) September 12, 2020
email करें scholarships@sonusood.me pic.twitter.com/tKwIhuHQ5j