Abhishek Bachchan: "నా కూతుర్ని అంటే ఊరుకోను" అంటున్న బచ్చన్
* "నన్ను మాత్రమే అనండి" అంటున్న అభిషేక్ బచ్చన్
Abhishek Bachchan: కొన్ని సార్లు సెలబ్రిటీలు మాత్రమే కాక వారి కుటుంబ సభ్యులు కూడా గురి కావాల్సి వస్తుంది. దీనివల్ల ఇబ్బంది పడ్డా సెలబ్రిటీలలో ఒకరు అభిషేక్ బచ్చన్. అమితాబచ్చన్ తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్న అభిషేక్ బచ్చన్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయి ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వారిద్దరి ఏకైక కూతురు ఆరాధ్య బచ్చన్ కూడా సోషల్ మీడియాలో సెలబ్రిటీ అని చెప్పవచ్చు. తాజాగా ఐశ్వర్య రాయ్ మరియు ఆరాధ్యతో కలిసి మాల్దీవ్స్ కి వెకేషన్ కి వెళ్లారు అభిషేక్ బచ్చన్.
మరోవైపు ఆరాధ్య పుట్టినరోజు సందర్భంగా కొందరు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. అప్పటిదాకా మామూలుగా నడిచిన ఆరాధ్య ఫోటోగ్రాఫర్లు చూడగానే క్యాట్వాక్ చేయడంతో అది చూసిన ఐశ్వర్యరాయ్ కూడా నవ్వేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానీ కొందరు మాత్రం ఆమెను ట్రోల్ చేస్తున్నారు. దీంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు అభిషేక్ బచ్చన్. "నేను పబ్లిక్ ఫిగర్ ని. నన్ను ఎంతైనా ట్రోల్ చేయండి పడతాను. కానీ నా కూతుర్ని అనే హక్కు మీకు లేదు. దమ్ముంటే ఆ మాటలు నా ఎదురుగా వచ్చి అనండి" అంటూ వార్నింగ్ ఇచ్చారు అభిషేక్.