BiggBoss 4 Telugu : మోనాల్ ఏడుపు.. అరియానా అల్లరి.. బిగ్ బాస్ హౌస్ అదిరింది!
BiggBoss 4 Telugu Highlights: * సోహైల్‌ను చూసి ఎమోషనల్ అయిన తండ్రి * ఆకలి గురించి సీక్రెట్ చెప్పిన అరియాణా * ఎమోషన్‌తో ఆడుకోవద్దని బిగ్‌బాస్‌ను హెచ్చరించిన మోనాల్ * అభిజిత్‌కు క్లాస్ పీకిన మోనాల్ సోదరి *వినిత్ ఎవరో క్లారిటీ ఇచ్చిన అరియానా * మోనాల్ ఎమోషన్‌తో ఆడుకున్న బిగ్‌బాస్ * జై సింగరేణి అంటూ సలీమ్‌కు వీడ్కోలు
బిగ్ బాస్ పది వారాలు పూర్తి చేసుకుంది. రోజు రోజుకు కంటెస్టెంట్ల మధ్య పెరుగుతున్న దూరాలను ఈ వారం దగ్గర చేసేందుకు బిగ్‌బాస్ ప్రయత్నించారు. అందుకోసం ఇంటి సభ్యుల ఫ్యామిలీస్‌ను హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే ఎపిసోడ్ గురువారం కూడా కొనసాగింది. ఫ్యామిలీస్ ఎంట్రీతో అఖిల్- అభిజీత్ కలిసి పోయారు. అరియాణా ఫ్రెండ్, సోహైల్ నాన్న, మోనాల్ చెల్లి హౌస్‌లోకి వచ్చారు. దాంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. బిగ్‌బాస్ హౌస్‌లో 74వ రోజు జరిగిన హైలైట్స్ ఎంటో చూద్దాం..
74 వరోజు హౌస్‌లో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఉదయం అరియాణా దోసె వేస్తున్న సమయంలో బిగ్‌బాస్ పవర్ సేవ్ అనగానే.. అందరూ అలానే ఉండిపోయారు. ఫాస్ట్ ఫార్వార్డ్, స్లో మోషన్ అంటూ బిగ్‌బాస్ కొద్దిసేపు ఇంటి సభ్యులను ఆడుకున్నారు.
అలిగిన మోనాల్ బయట గార్డెన్ ఏరియాకు వచ్చి కూర్చొంది. ఆమెను ఓదార్చేందుకు అఖిల్, సోహైల్ వచ్చారు. దాంతో ఆమె కొద్ది సేపటికే తన కోపాన్ని తగ్గించుకుని తిరిగి ఇంట్లోకి వెళ్లింది. కమాండ్ కంట్రోల్ ట్రైనింగ్ క్యాంప్‌లో భాగంగా బిగ్‌బాస్ ఇంటి సభ్యులను ఆడుకుంటే.. సోహైల్ మాత్రం అవినాష్‌ను ఆడుకున్నాడు. అవినాష్ ఏ మాత్రం చాన్స్ దొరికిన పులిహోర కలిపేందుకు ట్రై చేస్తున్నాడు. అరియాణా ఫ్రెండ్ హౌస్‌లోకి రాగానే కాళ్లు నేల మీద ఆగలేదు. తన దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించిన అరియాణాకు మధ్యలో గ్లాస్ అడ్డం పెట్టారు.దాంతో అరియాణాకు నిరాశే మిగిలింది. ఫ్రెండ్ చూసిన ఆనందంలో ఆమెకు ఏడుపు వచ్చింది. అయితే.. తన ఫ్రెండ్ తనకు ఎప్పటి నుంచి తెలుసు.. తనకోసం చేసినవి చెప్పుకోచ్చింది.
హౌస్‌లోకి ఫ్యామిలీ ఎంట్రీలో భాగంగా అరియాణా ఫ్రెండ్ వినయ్ లోపలికి వచ్చారు. వినీత్ ను చూసిన అరియాణా ఏడుపును ఆపుకోలేకపోయింది. ఏడువొద్దని ఎంత వాదించిన ఆమె మాత్రం ఏడుపును కంట్రోల్ చేసుకోలేకపోయింది. అయితే.. ఇదే సమయంలో హౌస్‌లోకి వచ్చిన వినీత్ వేరే వాళ్లను పలకరిస్తే అరియానా సహించలేకపోయింది. తనతోనే మాట్లాడమని అరిచి గీ పెట్టింది. గతేడాది వినీత్ ఇచ్చిన హామీని అరియాణా బయటకు రాగానే నెరవేరుస్తానని హామీ ఇచ్చాడు. అలాగే తనకు బట్టలు, చెప్పులు పంపించమంటూ చాంతాడంతా లిస్ట్ చెప్పింది. తమది 12 ఏళ్ల స్నేహమని.. తన కష్టసుఖాల్లో ప్రతిసారి ఇతడే ఉన్నాడ ని తెలిపింది. ఐ లవ్ యూ వినయ్ అంటూ సంతోషంతో గెంతులు వేసింది.
అరియాణా ఫ్రెండ్ వచ్చి వెళ్లగానే.. మోనాల్ అమ్మ వాయిస్ వినిపించింది. దాంతో మోనాల్ సంతోషంతో గెంతులు వేసింది. తాము హైదరాబాద్ రాలేకపోయామని చెప్పడంతో.. మోనాల్ ఏడుపు ఆపుకోలేకపోయింది. అయితే.. తన అమ్మ రాకపోవడంతో బిగ్‌బాస్ హెచ్చరికలు చేసింది. తన ఎమోషన్‌తో ఆడుకోవద్దని చెప్పింది. ఆ తర్వాత మోనాల్ చెల్లెను హౌస్‌లోకి పంపింది. అరియాణా తర్వాత బిగ్‌బాస్ మోనాల్ అమ్మ వాయిస్ వినిపించారు. మోనాల్ పాపా ఎలా ఉన్నావు.. నువ్వు చాలా గుర్తొస్తున్నావు.. హైదరాబాద్‌కు రాలేకపోయామని చెప్పింది. దీంతో తల్లి రావట్లేదని తెలిసి గుండెలవిసేలా మోనాల్ ఏడ్చింది. మోనాల్‌ను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. బిగ్‌బాస్ తన ఎమోషన్‌తో ఆడుకోకు అంటూ కోప్పాడింది. నాకు కోపం వస్తుందని చెప్పి.. ఏదో ఒకటి చెప్పమని బిగ్‌బాస్‌కు వార్నింగ్ ఇచ్చింది. ఏడుస్తున్న మోనాల్‌ను ఇంటి సభ్యులు ఓదార్చారు. ఆ తర్వాత మోనాల్ చెల్లెలు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెను చూసిన మోనాల్ కన్నీళ్లు పెట్టుకుంది.
ఆ తర్వాత సోహైల్ తండ్రి సలీమ్ లోనికి వచ్చాడు. సింగరేణి ఒక్కటే కాదు.. పల్లె గిల్లా అంతా మనదే, బయట కథ వేరే ఉందని ఆయన గర్వంగా చెప్పుకొచ్చాడు. తండ్రి కొడుకులు ఒకరి మీద ఒకరు ముద్దులు కురిపించుకున్నారు. తర్వాత జై సింగరేణి నినాదాలతో ఆయనకు అందరూ వీడ్కోలు తెలిపారు. ఆ తర్వాత లాస్య, మోనాల్, అఖిల్, సోహైల్ అందరూ సరదాగా ఒకరి తర్వాత ఒకరిని అందంగా తయారు చేయించే బాధ్యతను ఇచ్చారు. చివరకు శుక్రవారం ఎపిసోడ్‌లో లాస్య కొడుకు, భర్త వస్తున్నట్టు ప్రొమోలో చూపించారు. వారిని చూడగానే లాస్య ఎమోషనల్‌కి గురైంది.. అంటీ అనొద్దంటూ ఇంటి సభ్యులకు వార్నింగ్ ఇచ్చినట్టు ప్రొమోలో చూపించారు.. ఇది గురువారం బిగ్‌బాస్ ఎపిసోడ్ హైలైట్స్.. మరో ఎపిసోడ్‌లో మళ్లీ కలుద్దాం.