Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ 5వ సీజన్‌‌ నిర్వహణపై వ్యతిరేకత

Bigg Boss 5 Telugu: బుల్లితెర పాపులర్ షో మరోసారి సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.

Update: 2021-06-10 08:51 GMT

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ 5వ సీజన్‌‌ నిర్వహణపై వ్యతిరేకత

Bigg Boss 5 Telugu: బుల్లితెర పాపులర్ షో మరోసారి సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. నాలుగు సీజన్‌లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసిన నిర్వాహకులు ‌ఐదో సీజన్‌ను కూడా పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ సీజన్‌ ఎలా ఉంటుంది ఎప్పుడొస్తుందా అని కొందరు ఎదురుచూస్తుంటే కొందరు మాత్రం ఈ పరిస్థితుల్లో బిగ్‌బాస్‌ షో అవసరమా అంటున్నారు.

బిగ్‌ బాస్‌ షో త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఐదో సీజన్ నిర్వహణ కోసం ఏర్పాట్లు కూడా జరుగుతుండగా ఆన్‌లైన్‌లోనే ఇంటర్వ్యూలు కూడా చేసేస్తున్నారని తెలుస్తోంది. ఓ వారం పది రోజుల్లో కంటెస్టెంట్ల లిస్ట్ కూడా ఫైనల్ అయిపోయి జులైలో సీజన్ 5 స్టార్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలొస్తున్నాయి.

అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అటు సినీ, టీవీ కార్మికులు కూడా ఈ మహమ్మారి బారిన పడి ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్న ఈ సమయంలో బిగ్‌బాస్‌ షో నిర్వాహకులు అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

90 రోజుల పాటు జరిగే బిగ్‌బాస్‌ షోలో కంటెస్టెంట్లతో పాటు పనిచేసే వారంతా ప్రాణాలు రిస్క్ చేయాల్సి వస్తుంది. దీంతో కనీసం వ్యాక్సినేషన్ పూర్తి చేసైనా బిగ్‌బాస్‌ నిర్వహించాలని టీవీ టెక్నీషియన్లు సూచిస్తున్నారు.

ఇప్పటికే కోవిడ్ పరిస్థితుల కారణంగా వేసవిలోనే జరగాల్సిన బిగ్‌బాస్‌ షో వాయిదా పడింది. దాంతో జులైలో నిర్వహించాలని భావిస్తున్న సమయంలో నిర్వాహకుల తీరుపై వ్యతిరేకత వస్తుంది. దీంతో షో మేనేజ్‌మెంట్‌ తాము అనుకున్నదే చేస్తారా..? వ్యాక్సిన్ల కోసం వాయిదా వేస్తారా అనేది ఆసక్తిగా మారింది.

Full View


Tags:    

Similar News