Big Boss 8 Telugu Elimination: అభయ్ ఎలిమినేట్ అవుతాడా? డేంజర్ జోన్‌లో ఎవరెవరు?

Big Boss 8 Telugu Elimination, Week 3: బిగ్‌బాస్‌ 8వ సీజన్‌ ఇప్పుడిప్పుడే ఆసక్తిగా మారుతోంది. ఇప్పటికే రెండు వారాలు పూర్తికాగా మూడో వారంలోకి ఎంటర్‌ అయ్యింది.

Update: 2024-09-18 09:14 GMT

Bigg Boss Telugu: ఈ వారం హౌజ్‌ నుంచి ఎలిమినేట్ ఎవరు.? డేంజర్‌లో ఆ ఇద్దరు

Big Boss 8 Telugu Elimination, Week 3: బిగ్‌బాస్‌ 8వ సీజన్‌ ఇప్పుడిప్పుడే ఆసక్తిగా మారుతోంది. ఇప్పటికే రెండు వారాలు పూర్తికాగా మూడో వారంలోకి ఎంటర్‌ అయ్యింది. దీంతో ఈ వారం ఎలిమినేట్ కానుంది ఎవరన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రెండో వారంలో శేఖర్ బాషా అనూహ్యంగా ఎలిమినేట్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ తర్వాత శేఖర్ భాష తనకి తానుగా వెళ్లిపోయాడని ప్రకటన చేశారు.

ఇదిలా ఉంటే ఈ వారం ఓటింగ్‌లో లెక్కలు మారుతున్నాయి. ఈసారి ఇద్దరి అబ్బాయిలు డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నామినేషన్‌ ప్రక్రియ పూర్తయింది. సాధారణంగా ఎప్పుడూ రెండు రోజులు పట్టే నామినేషన్స్ ప్రక్రియ ఈసారి సోమవారం ఒక్క రోజులోనే తేలింది. మొత్తం ఎలిమినేషన్‌ జాబితాలోకి వచ్చారు. వీరిలో నాగమణికంఠ, యష్మీ, సీత, నైనిక, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, అభయ్ నవీన్ ఉన్నారు. అయితే టీమ్ లీడర్స్‌ని ఎవరూ నామినేట్ చేయొద్దని చెప్పిన బిగ్‌బాస్.. వీళ్లలో ఒకరు నామినేషన్స్‌లో ఉండాలని చెప్పాడు

ప్రస్తుతం జరిగిన ఓటింగ్ ప్రకారం.. అభయ్ నవీన్, పృథ్వీరాజ్ చివరి స్థానాల్లో ఉన్నారు. అయితే పృథ్వీ లవ్‌ ట్రాక్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్న తరుణంలో.. అభయన్‌ నవీన్‌కు ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఈ లాజిక్‌ నిజమైతే అభయన్‌ ఎలిమినేట్ కావడం కాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఆడియన్స్‌ పల్స్‌ ఎలా ఉందో తెలుసుకుందామనే ఉద్దేశంతో సెల్ఫ్‌ నామినేట్‌ అయిన అభయన్‌ తీసుకునన్ నిర్ణయం ఎలాంటి రిజల్ట్‌ను ఇస్తుందో చూడాలి. 

Tags:    

Similar News