Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ 8 కంటెస్టెంట్స్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా.?
Bigg Boss 8 Telugu Contestants List: ఈసారి బిగ్‌బాస్‌లో ప్రత్యేకంగా మూడు కండీషన్స్ పెట్టారు. వీటిలో ఒకటి ఈసారి హౌస్‌కు కెప్టెన్ ఉండడు. అలాగే కంటెస్టెంట్స్‌కు రేషన్ ఇవ్వరు. వాళ్లే సంపాదించుకోవాలి. అలాగే ప్రైజ్‌మనీ జీరో అంటూ రివీల్ చేశాడు.
Bigg Boss 8 Telugu Contestants: తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ విజయవంతంగా 7 సీజన్స్‌ను పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ కొత్త సీజన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆదివారం అంగరంగవైభవంగా నాగార్జున హోస్ట్‌గా సీజన్‌ను ప్రారంభించారు. ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ క్యాప్షన్‌తో ఈసారి షోను ప్రారంభించారు. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి అడుగుపెట్టారు. మొత్తం 14 మంది 7 జంటలుగా హౌజ్‌లోకి వెళ్లారు.
ఈసారి బిగ్‌బాస్‌లో ప్రత్యేకంగా మూడు కండీషన్స్ పెట్టారు. వీటిలో ఒకటి ఈసారి హౌస్‌కు కెప్టెన్ ఉండడు. అలాగే కంటెస్టెంట్స్‌కు రేషన్ ఇవ్వరు. వాళ్లే సంపాదించుకోవాలి. అలాగే ప్రైజ్‌మనీ జీరో అంటూ రివీల్ చేశాడు. అంటే, హౌస్‌మేట్స్ ఆటను బట్టి, ప్రైజ్‌మనీ లిమిట్‌లెస్‌గా మారుతుంది. ఇంతకీ ఈ సీజన్‌లో హౌజ్‌లోకి ఎంటర్ అయిన వారి ఎవరు.? వారి బ్యాగ్రౌండ్ ఎంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..
యష్మి: ఈసారి బిగ్‌బాస్‌హౌజ్‌లోకి అడుగు పెట్టిన తొలి కంటెస్టెంట్ నటి యష్మి. సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న యష్మి.. బిగ్‌బాస్‌లో పాల్గొనే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. హౌజ్‌లో తాను ఎలాంటి స్ట్రాటజీలు పాటించనని, మంచి పోటీ మాత్రం ఇస్తానని చెప్పుకొచ్చింది.
నిఖిల్: కన్నడ ఇండస్ట్రీ ద్వారా సినిమాలకు పరిచయమైన నిఖిల్ బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. బిగ్‌బాస్ సీజన్-8లో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నా. ప్రస్తుతానికి సింగిల్. కేవలం ఆట మీద ఆసక్తితోనే బిగ్‌బాస్‌కు వచ్చానని నిఖిల్ తెలిపారు.
అభయ్ నవీన్: మూడో కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి అడుగు పెట్టారు అభయ్ నవీన్. నటుడిగా, దర్శకుడిగా అభయ్ నవీన్ ‘పెళ్లి చూపులు’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణలోని సిద్ధిపేటకు చెందిన అభయ్ నవీన్.. ‘రామన్నయూత్’ సినిమా ద్వారా దర్శకుడిగా మారాడు.
ప్రేరణ కంభం: కన్నడలో ‘రంగనాయకి’ టీవీ షోతో మంచి పాపులర్ అయ్యారు ప్రేరణ కంభం. పలు తెలుగు సీరియల్స్‌లోనూ నటించారు. తనకు హౌస్‌లో లిమిట్‌లెస్‌గా నిద్ర కావాలి అంటూ చెప్పుకొచ్చారు.
ఆదిత్య ఓమ్: ‘లాహిరి లాహిరి లాహిరిలో..’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఆదిత్య ఓం. అయితే ఆ తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో పెద్దగా కనిపించలేదు. ఆ తర్వాత మళ్లీ 2010లో కెరీర్‌ను తిరిగి ప్రారంభించారు. పలు హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. సినిమాలతో పాటు పలు సేవ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. కెరీర్‌లో మళ్లీ పుట్టేందుకు బిగ్‌బాస్‌కు వస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు.
సోనియా: హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మరో కంటెస్టెంట్ సోనియా. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘దిశ’ మూవీతో ఆమె నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ.. డబ్బులున్న వాళ్లు రూ.కోట్లు పెట్టి బిగ్‌బాస్‌కు వద్దామన్నా కుదరదు. అతి తక్కువ మందికి వచ్చే అవకాశం తనకొచ్చిందని చెప్పుకొచ్చింది.
బెజవాడ అక్క: బెజవాడ అక్క అసలు పేరు మధు నెక్కంటి. వీడియోలతో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మధు.. బెజవాడలో బేబీలు, బేబమ్మలు ఎక్కువని, అందుకే నేను ఆ పేరు పెట్టుకున్నాని తెలిపారు. హౌస్‌లో తను ఫుడ్ లిమిట్‌లెస్‌గా కావాలని చెప్పుకొచ్చారు.
శేఖర్ భాష: శేఖర్ భాష గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించిన ఆయన చాలా మందికి సుపరిచతమే. తాజాగా లావణ్య, రాజ్ తరుణ్ వ్యవహరంలో శేఖర్ భాష బాగా ట్రెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇక బిగ్‌బాస్‌లో తనను ఫ్రెండ్స్‌గా చూస్తే పర్వాలేదని, శత్రువుగా చూస్తే మాత్రం కచ్చితంగా టైటిల్ పట్టుకుపోతానని వ్యాఖ్యానించారు.
కిరాక్ సంగీత: ‘బేబీ’ మూవీతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కిర్రాక్ సీత బిగ్‌బాస్ సీజన్-8లో అడుగు పెట్టారు. ముందు ఒకలా, వెనుక మరొకలా ఉండే వాళ్లంటే తనకు కోపమని. కెరీర్‌లో ఉన్నతంగా ఎదగాలన్నదే తన కోరిక అని చెప్పుకొచ్చారు.
నాగ మణికంఠ: ఈసారి హౌజ్‌లోకి అడుగుపెడుతోన్న సామాన్య కంటెంట్ నాగ మణికంఠ. ఆయన పరిచయం చూస్తే ఇది అర్థమవుతోంది. తాను కోల్పోయిన గౌరవాన్ని మళ్లీ పొందడానికి ‘బిగ్‌బాస్’షోకు వచ్చినట్లు తెలిపాడు.
పృథ్వీరాజ్: తెలుగుతో పాటు కన్నడ సీరియల్స్ నటించాడు పృథ్వీరాజ్. బిగ్‌బాస్‌లో పాల్గొనాలని ఎప్పటి నుంచో కోరికతో ఉన్నానని, మనీ, పేరు కోసం ఈ షోకు వస్తున్నానని చెప్పుకొచ్ఆచడు.
విష్ణుప్రియ: నటి, యాంక్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో రియాలిటీ షోల ద్వారా ప్రేక్షకులకు చేరువైన విష్ణు ప్రియ హౌజ్‌లో ఎలాంటి రంచ్చే స్తుందో చూడాలి. తనకు ఈ సీజన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ లిమిట్‌లెస్‌గా కావాలని చెప్పుకొచ్చింది.
నైనిక: ఢీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నైనిక. చిన్నప్పటి నుంచి తనకు డ్యాన్స్ అంటే ఇష్టమని, డ్యాన్సర్ కాకపోతే, నటిని అయ్యేదాన్ని అని, కెమెరా ముందు ఉండాలన్నదే తన కల అని తెలిపింది.
నబీల్ ఆఫ్రిది: వరంగల్ డైరీస్ అనే యూట్యూబ్ ఛానల్‌తో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు నబీల్ ఆఫ్రిది. చిన్నప్పటి నుంచి నటుడు కావాలన్న కోరికతో ఫన్నీ స్కిట్‌లు చేయడం మొదలు పెట్టి సోషల్‌మీడియాలో మంచి ఫాలోయింగ్ పొందాడు. బిగ్ బాస్ ఎంట్రీతో తన కల నెరవేరిందని చెప్పుకొచ్చాడు.