Cab Stories: బిగ్‌బాస్‌ ఫేమ్‌ దివీ 'క్యాబ్‌ స్టోరీస్‌' స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Cab Stories: క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌భావం అన్ని రంగాల‌పై ప‌డింది. ఇక సినీ ఇండ‌స్ట్రీపై క‌రోనా ప్ర‌భావం తీవ్రంగానే ఉంద‌ని చెప్పాలి.

Update: 2021-05-25 06:02 GMT
Divi Vadthyas Cab Stories on Sparak

 Divi Vadthyas Cab Stories

  • whatsapp icon

Cab Stories: క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌భావం అన్ని రంగాల‌పై ప‌డింది. ఇక సినీ ఇండ‌స్ట్రీపై క‌రోనా ప్ర‌భావం తీవ్రంగానే ఉంద‌ని చెప్పాలి. 2020లో క‌రోనా కార‌ణంగా అనేక సినిమాలు విడుద‌ల‌కు నోచుకోలేదు. దీంతో సినిమాలన్ని ఓటీటీ వేదిక‌గా రిలీజ్ కావ‌డం మొద‌లు పెట్టాయి. ఈ ఏడాది మొద‌ట్లో క‌రోనా ప్ర‌భావం త‌గ్గి ప‌రిస్థితులు కుదుట‌ప‌డ‌డంతో సినిమాలు రిలీజులు ఊపందుకున్నాయి. క‌రోనా సెకండ్ వేవ్ పుణ్య‌మా అని మ‌ళ్లీ గ‌డ్డుప‌రిస్థితులు వ‌చ్చాయి. థియేట‌ర్లు మూత‌ప‌డే స‌రికి కొన్ని సినిమాల‌కు ఓటీటీనే ప్ర‌త్యామ్న‌యంగా క‌నిపించింది.

ఇక ఈ నేప‌థ్యంలో బ‌ట్ట‌ల రామ‌స్వామి బ‌యోపిక్, సినిమా బండి, రాథే, డి కంపెనీ, ఇలా వ‌రుస సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యయి. ఓటీటీ హావా సాగుతుండటంతో సంచ‌లన ద‌ర్శ‌కుడు వ‌ర్మ కూడా ఓ ఓటీటీని స్థాపించాడు. దీంతో వ‌రుస సినిమాలు రిలీజ్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. వ‌ర్మ స్టార్ట్ చేసిన స్పార్క్ ఓటీటీలో క్యాబ్ స్టోరీస్ అనే మూవీ రిలీజ్ కానుంది. దాని విశేషాలు చూద్దాం.

బిగ్‌బాస్ తెలుగు 4 ఫేమ్ దివి ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ క్యాబ్ స్టోరీస్. బిగ్‌బాస్‌ బ్యూటీ, నటి దివి, శ్రీహాన్‌ నటించిన వెబ్‌ సిరీస్‌ సైతం ఓటీటీ వేదికగా విడుదలకు సిద్ధంగా ఉంది. మే 28వ తేదీన స్పార్క్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో క్యాబ్‌ స్టోరీస్‌ ప్రసారం కానుంది. కేవీఎన్‌ రాజేష్‌ దర్శకత్వంలో ఈ మూవీ తెర‌కెక్క‌గా.. ఎస్‌. కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో నేను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని షాలిని పాత్ర చేశాను. ఓ క్యాబ్‌ ఎక్కే క్రమంలో షాలిని పొరపాటు చేస్తుంది. ఆ పొరపాటు కథలోని మిగతా పాత్రలపై ప్రభావితం చూపుతుంది. దివి, గిరిధర్, ధన్‌రాజ్, ప్రవీణ్, శ్రీహాన్‌ ప్రధాన పాత్రల్లో న‌టించారు. 


Tags:    

Similar News