Bigg Boss 4 Telugu: హౌస్‌లో ''ఆడవాళ్లకు మాత్రమే'' కెప్టెన్సీ టాస్క్‌

Bigg Boss 4 Telugu: నోయల్ అనారోగ్యంతో బయటకు వెళ్ళిపోయాడు.. అరియానా 9 వ వారం బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ గా ఎంపిక అయింది.

Update: 2020-10-30 06:30 GMT

బిగ్‌బాస్‌ ప్రేమికులకు, నోయల్‌ అభిమానులకు చేదువార్త. అనారోగ్యంతో బాధపడుతున్న నోయల్‌ గంగవ్వ లాగే షో నుంచి బయటకు వచ్చేశాడు. దీంతో నోయల్‌కు ఇంటిసభ్యులు భారంగా వీడ్కోలు పలికారు. అటు మోనాల్‌పై సెటైర్లు వేస్తున్న అభిజిత్‌ హారికతో క్లోజ్‌గా మూవ్‌ అవుతున్నాడు. ఇక హౌస్‌లో ఎనిమిదో కెప్టెన్‌గా అరియానా పగ్గాలు చేపట్టింది. అయితే రేషన్‌ మేనేజర్‌ నియామకంపై మాస్టర్‌ అసంతృప్తిలో ఉన్నారు.

కొంతకాలంగా అనారోగ్య సమస్యలను భరిస్తూ నవ్వుతూ వచ్చిన నోయల్‌కు ఆరోగ్యం మరింత క్షీణించింది. సరిగా విశ్రాంతి లేక మెడ నరాలు, భుజాలు నొప్పి పెడుతూ అతడిని మరింత బాధించాయి. అటు ఎనిమిదోవారం కెప్టెన్సీ టాస్క్‌ను ఆడవాళ్లకు మాత్రమే ఇచ్చాడు బిగ్‌బాస్‌. అనారోగ్యంతో బాధపడుతున్న నోయల్‌కు అర్ధరాత్రి దాటిన నిద్ర పట్టలేదు. దీంతో ఒంటరిగా పాటలు పాడుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అటు అభి నోయల్‌ దగ్గర కూర్చుని మోనాల్‌పై సెటైర్‌ వేశాడు. ఆమె పెద్దగా అడుగులేసుకుంటూ ఒంటెలా నడుస్తుందని కామెంట్‌ చేశాడు. మరి నువ్వు దుబాయ్‌ షేక్‌లా కూర్చున్నావని నోయల్‌ అభి గురించి చెప్పుకొచ్చాడు.

53వ రోజు హౌస్‌లో "శంకర్ దాదా MBBS" సినిమాలోని ఓ సాంగ్‌ ప్లేచేశాడు బిగ్‌బాస్‌. ఈ పాటకు ఇంటిసభ్యులందరూ కలిసి గార్డెన్‌ ఏరియాలో హుషారుగా డ్యాన్స్‌ చేశారు. బిగ్‌బాస్‌ "ఆడవాళ్లకు మాత్రమే" కెప్టెన్సీ టాస్క్‌ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో భాగంగా గార్డెన్‌లో ఏరియాలో ఒక యాపిల్‌ చెట్టు దానిపై పోటీదారుల ఫొటోలు అతికించి ఉన్నాయి. దానిప్రక్కనే ఒక డబ్బా, దాని తాళం ఉన్నాయి. అయితే మూడుసార్లు బజర్‌ మోగినప్పుడు అబ్బాయిలు ఆ తాళపుచెవిని సంపాదించి నచ్చిన అమ్మాయికి ఇవ్వొచ్చు. అప్పుడు ఆమె తాళంచెవి సాయంతో డబ్బాలోని కత్తి తీసుకుని ఎవరు కెప్టెన్‌ అవడానికి వీల్లేదని భావిస్తారో ఆమె ఫొటో అతికించి ఉన్న యాపిల్‌ను తెంపి ముక్కలు ముక్కలుగా కోయాల్సి ఉంటుంది.

ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువా అన్నట్లు సాగింది బిగ్‌బాస్ హౌస్‌లో ఎనిమిదో కెప్టెన్సీ పోటీ. కలిసిమెలిసి ఉన్నట్లుగా కనిపించినా తమలో దాగి ఉన్న ఈర్ష, అసూయలను బయటకు చూపించారు ఇంటి మహిళలు. దేత్తడి హారికైతే తనను సైడ్‌ చేసిన మోనాల్‌పై ఫ్రస్టేషన్‌ చూపించింది. ఓ అడుగు ముందుకు వేసి తెలివి ఉన్నా సరైన సమయంలో ఉపయోగించడం లేదంటూ కామెంట్‌ చేసింది.

టాస్క్‌లో మొదట తాళపు చెవిని దక్కించుకున్న అఖిల్‌ను తాళపు చెవి తనకివ్వమంటే తనకివ్వండని అమ్మాయిలు అర్జీ పెట్టుకున్నారు. కానీ అతడు మాత్రం అందరూ ఊహించినట్లుగా మోనాల్‌కే ఇచ్చాడు. కత్తి చేతబట్టిన మోనాల్‌ హారిక కెప్టెన్సీకు అర్హురాలు కాదంటూ ఆమె ఫొటో ఉన్న పండును ముక్కలు ముక్కలు చేయడంతో దేత్తడి హర్టయ్యింది. తర్వాత తాళపు చెవిని దక్కించుకున్న మోహబూబ్‌ దాన్ని అరియానాకు ఇచ్చాడు. కత్తి అందుకున్న అరియానా లాస్య ఫొటో ఉన్న పండును నాశనం చేసి ఆమెను కెప్టెన్సీ పొటీ నుంచి తొలగించింది. మూడో బజర్‌ కీ తాళపు చెవిని చేజిక్కించుకున్న మాస్టర్‌ దాన్ని అరియానాకు ఇవ్వగా ఆమె మోనాల్‌ను సైడ్‌ చేసేసింది. దీంతో అరియానా హౌస్‌లో రెండో మహిళా కెప్టెన్‌గా అవతరించింది. అప్పటికే ఫ్రస్టేషన్‌లో ఉన్న హారిక నీకు తెలివి ఉంది కానీ కరెక్ట్‌ టైమ్‌లో పని చేయలేదని మోనాల్‌ను నవ్వుతూనే తిట్టింది.

ప్రస్తుతం బిగ్‌బాస్‌ హౌజ్‌లో అరియానా, మాస్టర్‌ మధ్య వార్‌ నడుస్తోంది. అరియానా కెప్టెన్‌ అవడానికి కీ రోల్‌ పోషించినా మాస్టర్‌ అరియానా తీరుపై గుర్రుగా ఉన్నాడు. అటు ఓ మంచి కంటెస్టెంటు ఇంట్లో నుంచి హఠాత్తుగా వెళ్లిపోవడాన్ని తోటి సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. కెప్టెన్‌ అరియానా రేషన్‌ మేనేజర్‌గా మోనాల్‌ను ఎంచుకుంది. దీంతో మాస్టర్‌ ముఖం మాడ్చుకున్నాడు. అంతేకాదు అరియానాకు విశ్వాసం లేదని అసహనం వ్యక్తం చేశాడు. మాస్టర్‌ తీరుతో విసుగెత్తిన అరియానా రేషన్‌ మేనేజర్‌గా ఉంటే సేవ్‌ అవుతారని ఎక్కడా లేదని స్పష్టం చేసింది.

అనారోగ్యంతో బాధపడుతున్న నోయల్‌ను వైద్యులు పరీక్షించారు. అతడు మెడికల్‌ రూమ్‌కు వెళ్లడం చూసిన హారిక నోయల్‌ వెళ్లిపోవడం తనకు ఇష్టం లేదంటూ ఏడ్వడంతో ఆమెను అభిజిత్‌ హత్తుకుని ఓదార్చాడు. ఇక నోయల్‌ను కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్‌ స్పెషలిస్టుల సలహా మేరకు మరింత మెరుగైన వైద్యం అందుకునేందుకు ఇంటి నుంచి వెళ్లిపోవాలని సూచించాడు. ఇక త్వరలోనే పూర్తి ఆరోగ్యవంతులై నోయల్‌ హౌస్‌కి తిరిగి రావాలని బిగ్‌బాస్‌తోపాటు ఇంటిసభ‌్యులు కోరుకున్నారు. అటు నీకోసం ఎదురు చూస్తూ ఉంటానని హారిక నోయల్‌ వెళ్లిపోయిన చాలాసేపటివరకు ఏడుస్తూనే ఉంది.

మొత్తానికి వైద్యల సలహా మేరకు మెరుగైన వైద్యం అందుకునేందుకు ఇంటి నుంచి వెళ్లిపోయిన నోయల్‌ తర్వలోనే పూర్తి ఆరోగ్యవంతులై తిరిగి రావాలని బిగ్‌బాస్‌ ప్రేమికులు కోరుకుంటున్నారు. అటు నోయల్‌ పూర్తి ఆరోగ్యంతో ఇంట్లోకి రీ ఎంట్రీ ఇస్తాడని తోటి కంటెస్టెంట్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

Tags:    

Similar News