Bigg Boss 4 Telugu: పసలేని టాస్క్ వాళ్ళిద్దరూ కెప్టెన్ పోటీలో!
Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ లో మంచి మనుషులు-కొంటె రాక్షసులు పేరుతొ రెండు రోజులుగా సాగిన ఎపిసోడ్ ఎలాగోలా పూర్తయింది.
బిగ్ బాస్ సీజన్ 4, 45 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుని 46వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది. ఇక షోలో ఇంటి సభ్యుల మధ్య పోటాపోటీ పోరు కనిపించడం లేదు. ఈ టాస్క్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. కొంటె రాక్షసులు- మంచి మనుషులు' మధ్య పసలేని టాస్క్ రెండో రోజు కూడా సాగింది. మంగళవారం నాడే పరమ బోరింగ్ అనుకుంటే అదే టాస్క్‌ని బుధవారం నాడు కూడా కొనసాగించారు. దీంతో షోపై నెగెటివ్ ఒపీనియన్ డెవలప్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకి 46 ఎపిసోడ్‌లో ఏం జరిగింది? మరి బిగ్‌బాస్ ఇచ్చిన టాస్కులో ఎవరు బాగా ఆడారు? ఎవరి ఐడియా వర్కవుట్ అయింది. మంచికి చెడుకు మధ్య జరిగిన ఈ యుద్ధంలో ఎవరు విజయం సాధించారో ఒకసారి చూద్దాం.
పొద్దున్నే లేవగానే వెళ్లి అఖిల్‌కు కౌగిలింత ఇవ్వకపోతే రోజు మొదలవ్వదు మోనాల్‌కు. ఈ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటనేది బిగ్ బాస్‌కు కూడా అంతుచిక్కడం లేదు. నిన్నటి వరకు అఖిల్‌తో తిరిగిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఉన్నట్లుండి పార్టీ మార్చేసింది. అయితే ఆమెకు ఎవర్నొకర్ని హగ్ చేసుకోకపోతే హౌస్ నుంచి పంపేస్తామని బిగ్ బాస్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారో ఏమో తెలియదు కానీ హగ్ ఇవ్వడంతోనే టాస్క్‌లను కంప్లీట్ చేసింది.
ఇక బుధవారం నాటి 46వ ఎపిసోడ్‌లో తొలి టాస్క్‌లో రాక్షసులు విజయం సాధించారు. ఒక సర్కిల్ గీసి అందులో మంచి మనుషులు ఉండాలని ఆ సర్కిల్‌లో ఉంచిన మూటలు సర్కిల్ బయటకు విసిరేస్తూ ఉండాలని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సర్కిల్ బయటకు రాకూడదని కండిషన్ పెట్టారు. అయితే మంచి మనుషులు టీం సభ్యులు సర్కిల్ క్రాస్ చేయడంతో రాక్షసుల టీం ఈ టాస్క్‌లో విజయం సాధించింది.
రాక్షసుల టీంలో మెహబూబ్, అరియానా, అవినాష్ ముగ్గురు ఉన్నప్పటికీ కూడా మంచి మనుషులకు చెమటలు పట్టించారు. వాళ్ల వస్తువుల్ని విసిరి పారేస్తే రాక్షసిలా ప్రవర్తించి మంచి మనుషుల సహనానికి పరీక్ష పెట్టారు. అవినాష్ రాక్షసుడిగా నటిస్తూనే అరియానా, మోనాల్‌లతో మంచిగా పులిహోర కలుపుతూ కనిపించాడు. ఇక మాట్లాడితే హగ్ ఇచ్చి అవినాష్‌ని శాంతిపచేయడంతో మళ్లీ మళ్లీ మోనాల్ దగ్గరకే వెళ్లడానికి ఆమె కౌగిల్లో బంధీ కావడానికి తెగ ప్రయత్నించాడు. ఇక మెహబూబ్ కూడా వచ్చి లైన్‌లో ఉండటంతో అడిగిన వారికి కాదనకుండా మళ్లీ హగ్‌లతో పిచ్చెక్కింది మోనాల్.
టాస్కులో భాగంగా కొంటె రాక్షసులు విచ్చలవిడిగా ప్రవర్తించారు. నానారకాలుగా హింసిస్తూ చెలరేగిపోయారు. ఉన్నది ముగ్గురే అయినా మంచి మనుషులకు చుక్కలు చూపించారు. ఈ ఎపిసోడ్స్ లో కొట్లాటలు కూడా జరిగాయి. ఇక టాస్క్ లలో మెహబూబ్ మంచి మనుషులకు చాలా ఆవేశాన్ని తెప్పించాడు. అయినా రాక్షసులపై మంచి మనుషుల టీమ్ గెలిచింది.
కుండలతో స్విమ్మింగ్ పూల్ నుంచి నీళ్లు తీసుకుని డ్రమ్ములు నింపాలని మంచి మనుషులకు మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అయితే ఈ టాస్క్ లో మెహబూబ్ ఫిజికల్ గా ఒక్కొక్కరిపైకి వెళుతూ నెట్టి వేశాడు. డ్రమ్ములను నెత్తివేస్తూ కుండలను కూడా పగలకొట్టాడు. ఈ క్రమంలో అఖిల్, మెహబూబ్ మధ్యలో మాటకు మాట పెరిగింది. దమ్ముంటే రారా అంటూ అఖిల్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. చివరాఖరకు ఈ టాస్కులో మంచి మనుషుల టీమ్ విజయం సాధించింది. అవినాష్ ని మంచి మనిషిగా మార్చాలని సెలెక్ట్ చేసుకొని రాక్షసుని తలను పగలకొట్టారు.
మంచి మనుషులు కొంటె రాక్షసులు టాస్క్ లో భాగంగా రక్షసులుగా మిగిలిన ముగ్గురిని కూడా మంచి మనుషులుగా మార్చేశారు. మరి ఈ టాస్క్‌లో ఎవరు బెస్ట్ పర్ఫార్మర్? వరస్ట్ కంటెస్టెంట్స్‌కి బిగ్ బాస్ ఇచ్చిన శిక్ష ఎంటీ? కెప్టెన్ స్థానానికి ఎవరు పోటీలో ఉన్నారు..?
ఇక చివరికి మెహబూబ్, అరియానా మాత్రమే మిగలగా మరో టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్ వారిని ఎత్తుకోవలని చెప్పడంతో అరియానాను టార్గెట్ చేసి మంచి మనుషులు విజయం సాధించారు. ఇక అందరు మంచివారిగా మారిపోయారు. ఇక ఫైనల్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని మెచ్చుకొని టీమ్ సభ్యులలో బెస్ట్ కంటెస్టెంట్స్, వరస్ట్ కంటెస్టెంట్స్ ని మీరే ఎంచుకోవాలని చెప్పగా ఎవరు చెప్పలేదు. ఇక ఫైనల్ గా బిగ్ బాస్ కోరిక మేరకు కెప్టెన్ గా ఉన్న నోయల్ చుక్కలు చూపించిన అవినాష్, అరియానా బెస్ట్ కంటెస్టెంట్స్ అని చెప్పాడు. దీంతో బిగ్ బాస్ వారిద్దరిని కూడా కెప్టెన్ స్థానానికి పోటీలో ఉంచారు.
ఇక కెప్టెన్ పోటీదారులుగా ఎంపిక అయిన అరియానా, అవినాష్‌లలో అరియానాను కెప్టెన్ చేయడానికి ఇంటి సభ్యులు డిసైడ్ అయినట్లున్నారు. అయితే వీళ్లకి బండి తొయ్యరా బాబూ అనే ఫిజికల్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ మరి వీళ్లలో ఎవరు గెలుపొందుతారో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తేలనుంది. అయితే బిగ్ బాస్ షో దాదాపు మరో రెండు నెలలు కొనసాగాల్సి వుంది. అయితే ఆసక్తి రేపే టాస్క్ లు ఉంటే బాగుంటుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. నస తప్ప పస లేకుండా డల్‌గా కొనసాగితే అట్టర్ ప్లాప్ అయినట్లే నని చెబుతున్నారు. చూద్దాం ఆడియన్స్ ఒపీనియన్ ఎంత వరకు పరిగణలోకి తీసుకుంటారో!