Big Boss7: బిగ్ బాస్ 7 కోసం భారీ మార్పులు.. సీక్రెట్ రూంలో విడాకుల జంటలు..
ఏడవ సీజన్ ని ఎలా అయినా గ్రాండ్ హిట్ చేయాలని స్టార్ మా టీం కసితో ఉంది. అందుకు తగ్గట్టుగానే గత సీజన్స్ కి భిన్నంగా సరికొత్త ఐడియాస్ ను 7వ సీజన్ లో పరిచయం చేయాలనుకుంటున్నారు.
BigBoss: బుల్లితెరపై సంచలనం సృష్టించిన రియాల్టీ షోస్ లో బిగ్ బాస్ ఒకటి. తెలుగులో కంటే ఇతర రీజనల్ లాంగ్వేజెస్ లో బిగ్ బాస్ ముందుగానే ప్రారంభం అయినా మనకు మాత్రం కాస్త లేట్ అయింది. ఫస్ట్ లో ఈ రియాల్టీ షో ఆడియెన్స్ కి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ క్రమంగా ఆదరణ పెరుగుతూ వచ్చింది. బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు చిన్నగా ఆడియెన్స్ లో క్యూరియాసిటీ లెవల్స్ ను పెంచాయి. అలా ఫస్ట్ సీజన్ హిట్ కాగా వరుసగా 6 సీజన్లను నిర్వహించారు.
బిగ్ బాస్ హోస్టులుగా ఎన్టీఆర్, నాని, నాగార్జున హోస్టులుగా వ్యవహరిస్తూ వచ్చారు. చివరి నాలుగు ఎపిసోడ్స్ కి హోస్ట్ గా నాగార్జున ఉన్నారు. అయితే నాల్గవ సీజన్ హిట్టయినట్లు మరే సీజన్ ఆ రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక చివరి సీజన్ అయితే మరీ సప్పగా సాగిందంటూ బుల్లి తెర ప్రేక్షకులు పెదవి విరిచారు. టీఆర్పీ రేటింగ్స్ సైతం పడిపోతూ వచ్చాయి.
ఇక ఏడవ సీజన్ ని ఎలా అయినా గ్రాండ్ హిట్ చేయాలని స్టార్ మా టీం కసితో ఉంది. అందుకు తగ్గట్టుగానే గత సీజన్స్ కి భిన్నంగా సరికొత్త ఐడియాస్ ను 7వ సీజన్ లో పరిచయం చేయాలనుకుంటున్నారు. ఆరవ సీజన్ ఫ్లాప్ కావడానికి కంటెస్టెంట్స్ ప్రధాన కారణమని భావిస్తున్న నిర్వాహకులు ఆ దిశగా పలు మార్పులు చేశారట. బుల్లితెరపై బాగా క్రేజ్ ఉన్న సెలబిట్రీస్ ని సెలక్ట్ చేసుకోవడంతో పాటు, వివాదాస్పద వ్యక్తులను, అలాగే విడాకులు తీసుకున్న పాపులర్ జంటలను కంటెస్టెంట్స్ గా ఎంపిక చేసుకోనున్నారట. అంతేకాదు, సీక్రెట్ రూంలో విడిపోయిన జంటలను ఉంచబోతున్నట్లు టాక్ జోరుగా నడుస్తోంది.
మొత్తంగా 7వ సీజన్ లో భారీ మార్పులే కనిపించబోతున్నాయి. ఇక మరో ట్విస్ట్ ఏంటంటే, హోస్ట్ గా బాలకృష్ణ వ్యవహరిస్తారని టాక్ నడుస్తోంది. ఇందులో నిజానిజాలు ఏంటనేది తెలియాలంటే నిర్వాహకులు ముందుకొచ్చి ప్రకటన ఇవ్వాలి. ఏదిఏమైనా, టీఆర్పీలను బద్దలు కొట్టేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. మరి ఎంతవరకు సక్సెస్ సాధిస్తారో చూడాలి మరి.