Bandla Ganesh Safe: కరోనా నుంచి బండ్ల గణేష్ సేఫ్!

Bandla Ganesh Safe: సినీ ప్రముఖుడు, నిర్మాత బండ్ల గణేష్ కరోనా సోకిందన్న విషయం అందరికి తెలిసిందే..

Update: 2020-06-30 18:39 GMT

Bandla Ganesh Safe: సినీ ప్రముఖుడు, నిర్మాత బండ్ల గణేష్ కరోనా సోకిందన్న విషయం అందరికి తెలిసిందే.. ప్రస్తుతం అయన కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని అయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అంతేకాకుండా కరోనా నుంచి కోలుకున్నట్టుగా అపోలో డయోగ్నోస్టిక్స్‌లో‌ కరోనా నిర్దారణ పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్‌‌ను కూడా షేర్‌ చేశారు బండ్ల గణేష్.. ఇక కరోనా నుండి కోలుకోవటంతో ఆయన ఆనందంతో థాంక్ గాడ్ అంటూ ట్వీట్ చేశాడు. బండ్ల గణేష్ కి కరోనా సోకింది అనగానే టాలీవుడ్ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనితో ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం అయన కరోనా నుంచి బయటపడడంతో అయన అభిమానులు ఉపిరి పీల్చుకున్నారు.

తెలుగు సినిమా ల్లో కామెడీ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు బండ్ల గణేష్.. . సుస్వాగతం, సూర్యవంశం, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత నిర్మాతగా మారి ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరు అమ్మాయిలతో మొదలగు చిత్రాలు నిర్మించాడు. ఇక రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బండ్ల గణేష్ 2018 తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో పోటీచేయాలని కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కానీ అతనికి టికెట్ దక్కలేదు. ఆ తర్వాత 2019లో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం సినిమాలను నిర్మించే పనిలో ఉన్నారు గణేష్!


Tags:    

Similar News