తెలుగు సినిమాలలో మాత్రమే కాక, రాజకీయ చరిత్రలో కూడా నందమూరి తారకరామారావు తనదైన ముద్ర వేసుకున్నారు. సినిమా స్టార్ గా రాజకీయాలలోకి అడుగుపెట్టి కేవలం తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి గా ఎన్నుకోబడడం కేవలం ఎన్టీఆర్ కు మాత్రమే దక్కిన ఘనత. ఇక ఎన్టీఆర్ సినీ ప్రస్థానాన్ని 'ఎన్టీఆర్ కథానాయకుడు' లో చూశాం. ఇప్పుడు ఆయన రాజకీయ జీవితాన్ని 'ఎన్టీఆర్ మహనాయకుడు'లో చూడబోతున్నాం. ఇక ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో చైతన్యయాత్ర కీలకమైనది.
అప్పట్లో చైతన్యరథంపై ఆయన ప్రతి పల్లె, పట్నం తిరిగి ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేవారు. చైతన్యరథయాత్ర వల్ల ప్రజలతో ఎన్టీఆర్ మరింత దగ్గరయ్యారు. ఆ చైతన్యయాత్రలో చైతన్య రథసారథిగా హరికృష్ణ ఉండేవారు. ఇప్పుడు 'ఎన్టీఆర్ మహానాయకుడు' లో కల్యాణ్ రామ్ హరికృష్ణ అవతారం ఎత్తనున్నారు. వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా ఈ చైతన్యయాత్రలో పాల్గొననున్నారు. ఆ సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్నాయి. సినిమాలో ఈ సన్నివేశాలు హైలైట్ అవుతాయని దర్శకుడు క్రిష్ మరియు చిత్ర బృందం భావిస్తోంది. ఈ ఫిబ్రవరిలో విడుదల కానుంది.