AR Rahman sensational comments on Bollywood Industry: ఏఆర్‌ రెహమాన్‌ సంచలన వ్యాఖ్యలు

Update: 2020-07-26 04:46 GMT

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ అవార్డు గ్రహీత, మ్యూజిక్‌ మేస్ట్రో ఏఆర్‌ రెహమాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు సంబంధించిన కొన్ని పుకార్లు ఇండస్ట్రీలో వ్యాపించాయని, దీని వెనక ఒక గ్యాంగ్‌ ఉందని పేర్కొన్నారు. సంగీతాభిమానులు, బాలీవుడ్‌ తన నుంచి చాలా ఆశిస్తోంటే దానికి ఒక ముఠా అడ్డుపడుతోందని ఆరోపించారు. రేడియో మిర్చి ఆర్‌జే సురేన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి.

'మంచి సినిమాలకు నేను నో చెప్పను. కానీ అక్కడ (బాలీవుడ్‌)లో ఓ గ్యాంగ్ ఉందనుకుంటున్నా. తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల సదరు గ్యాంగ్‌ నాపై అసత్యాలను ప్రచారం చేస్తోంది' అని విమర్శించారు. దిల్‌ బేచారా దర్శకుడు ముఖేశ్ ఛాబ్రా తన దగ్గరకు వచ్చినప్పుడు రెండ్రోజుల్లో నాలుగు పాటలు చేసిచ్చానని రెహమాన్ చెప్పారు. ఆ సమయంలో ఛాబ్రా తనతో.. 'చాలా మంది మీ (రెహమాన్) వద్దకు వెళ్లొద్దని ఏవేవో స్టోరీస్ చెప్పా'రని పేర్కొన్నారు. దీంతో తాను హిందీలో తక్కువ మూవీస్ చేయడానికి రీజన్ తెలిసిందని, అలాగే మంచి సినిమాలు తన వద్దకు ఎందుకు రావడం లేదో అర్థమైందన్నారు. కాగా సుశాంత్ ఆత్మహత్య తరువాత బాలీవుడ్‌లో నెపోటిజం మరోసారి వెలుగులోకి వచ్చింది. నెపోటిజం వలనే సుశాంత్‌ను కోల్పోవాల్సి వచ్చిందంటూ ఫ్యాన్స్ ఆరోపించారు. వారి ఆరోపణలపై పలువురు సినీ ప్రముఖులు సైతం మద్దతు తెలిపారు. అంతేకాదు కొందరు నటీనటులు ముందుకొచ్చి.. తాము ఎదుర్కొన్న అనుభవాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ కూడా బాలీవుడ్‌పై కామెంట్లు చేయడం సంచలనంగా మారింది.

Tags:    

Similar News