Jhansi And Sunitha About Marriage : మ‌ళ్లీ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సునీత‌,ఝాన్సీ!

Jhansi And Sunitha Gives Clarity About Marriage : యాంకర్ గా ఝాన్సీ, సింగర్ గా సునీత వీరిద్దరూ రెండు దశాబ్దాలకి పైగా ప్రేక్షకులకి సుపరిచితులే..

Update: 2020-08-06 08:11 GMT
sunitha, Jhansi (File Photo)

Jhansi And Sunitha Gives Clarity About Marriage : యాంకర్ గా ఝాన్సీ, సింగర్ గా సునీత వీరిద్దరూ రెండు దశాబ్దాలకి పైగా ప్రేక్షకులకి సుపరిచితులే.. దాదాపుగా వీరిద్దరికీ కెరీర్ ఒకేసారి మొదలైంది కూడా.. ఒకే సినిమాతో వీరికి గుర్తింపు వచ్చింది కూడా... అదే ఎస్వీ కృష్ణారెడ్డి 'ఎగిరేపావురమా'.. ఈ సినిమాలో ఝాన్సీ చిన్న పాత్ర చేస్తే, సునీత‌ ఇంకా ఆ పాటలతో అలరిస్తూనే ఉంది. ఇక వీరిద్దరూ మంచి స్నేహితులు..

తాజాగా వీరిద్దరూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరికి ఓ ప్రశ్న ఎదురైంది. మ‌ళ్లీ పెళ్లెప్పుడు? అని.. దీనిపైన ముందుగా ఝాన్సీ స్పందిస్తూ.. చేసుకుంటే త‌ప్పకుండా చెబుతానంటూ ఝాన్సీ తెలివిగా స‌మాధానం ఇచ్చింది. అంతేకాకుండా ఈ ప్రశ్నకు ప్రేక్షకులు ఆల్రెడీ ఎవరికీ వారే స‌మాధానాలు ఇచ్చుకుంటార‌ని, అలా స‌మాధాన ప‌డిన వారిని నిరుత్సాహప‌రిచే ఉద్దేశం త‌న‌కు లేదంటూ స‌ర‌దాగా చెప్పుకొచ్చింది ఝాన్సీ.. ఇక దీనిపైన సునీత స్పందిస్తూ.. ప్రస్తుతం త‌ను హాయిగా ఉన్నట్టుగా, 'ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ చెప్పలేం అంటూ చెప్పుకొచ్చింది.

ఇక ఝాన్సీ వివాహం నటుడు జోగి నాయుడుతో జరిగింది. వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె ,కూడా ఉంది. ఇక ఆ తర్వాత వీరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారు. అటు జోగి నాయుడు మరో వివాహం చేసుకోగా, ఝాన్సీ మాత్రం ఒంటరిగానే ఉండిపోయింది. అటు సునిత విషయానికి వచ్చేసరికి ఈమెకు 19 సంవత్సరాల వయసులోనే కిరణ్ అనే వ్యక్తితో వివాహమైనది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత సునీత, కిరణ్ విడాకులు తీసుకున్నారు. 

Tags:    

Similar News