కేబీసీలో తెలంగాణ టీచర్.. ఫిదా అయిపోయిన బిగ్ బీ!

Amitabh Bachchan Impressed : కౌన్‌ బనేగా కరోడ్‌ పతి (కేబీసీ) ఈ షో గురించి అందరికి తెలిసే ఉంటుంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున ఈ షో 12 వ సీజన్‌ ప్రస్తుతం కొనసాగుతోంది

Update: 2020-10-06 06:25 GMT
కేబీసీలో తెలంగాణ టీచర్.. ఫిదా అయిపోయిన బిగ్ బీ!

 KBC Contestant of Sabitha Reddy

  • whatsapp icon

Amitabh Bachchan Impressed : కౌన్‌ బనేగా కరోడ్‌ పతి (కేబీసీ) ఈ షో గురించి అందరికి తెలిసే ఉంటుంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున ఈ షో 12 వ సీజన్‌ ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే ఈ షోలో తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌ కి చెందిన సబితారెడ్డి పాల్గొన్నారు.. ఆమెకి సంబంధించిన లైఫ్ జ‌ర్నీని వీడియో ద్వారా చూపించ‌గా ఆమె లైఫ్ జర్నీకి అమితాబ్ ఫిదా అయిపోయారు. తన భర్తను కోల్పోయిన సబితా తన పిల్లలను పెంచి పెద్ద చేసింది. స్పూర్తిదాయకమైన ఆమె జీవితం పట్ల అమితాబ్ ప్రశంసలు కురింపిచారు.

ఒక టీచర్‌గా పిల్లలకు మంచి విద్యను అందిస్తానని సబిత చెప్పుకొచ్చారు. జీవితంలో పిల్లలకు ఆస్తులు ఇవ్వకున్నా కానీ, మంచి విద్యను అందివ్వాలని ఆమె ఈ షోలో వెల్లడించారు. నేడు (మంగళవారం) రాత్రి ఈ ఎపిసోడ్ సోనీ టీవీలో ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ లో సబితాతో పాటు మరో 7 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ఇక అటు అమితాబ్ కి ఇటీవల కరోనా సోకిన సంగతి తెలిసిందే.. అయనతో పాటుగా అయన కుటుంబం కూడా కరోనా బారిన పడింది.. వీరంతా ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇందులో ఐశ్వర్యరాయ్, ఆరాధ్య త్వరగానే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత అమితాబ్, అభిషేక్ కరోనా నుంచి కోలుకున్నారు.

Tags:    

Similar News