Amitabh Bachchan Apologises : తప్పుకు క్షమాపణలు కోరిన బిగ్ బీ
Amitabh Bachchan Apologises : తానూ చేసిన ఓ తప్పుకు గాను అభిమానులను క్షమాపనులను కోరాడు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్..
Amitabh Bachchan Apologises : తానూ చేసిన ఓ తప్పుకు గాను అభిమానులను క్షమాపనులను కోరాడు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. తాజాగా బిగ్ బీ కుటుంబం కోరోనా బారిన పడిన సంగతి తెలిసిందే... బిగ్ బీ తో పాటుగా ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్, మనవరాలు ఆరాధ్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక వీరంతా ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇందులో ఐశ్వర్యరాయ్, ఆరాధ్య త్వరగానే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక అమితాబ్ బచ్చన్ కూడా గత ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్నీ అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ప్రస్తుతం బిగ్ బీ ఇంట్లోనే హోం క్వారంటైన్‌లో ఉంటూ తన తండ్రికి ప్రముఖ కవి హరివంశ రాయ్ బచ్చన్ రాసిని కవితలను అభిమానులతో పంచుకుంటున్నారు. అందులో భాగంగానే బుధవారం రాత్రి బిగ్ బీ 'అకెలెపాన్ కాబాల్' అనే కవితను షేర్ చేసి అది తన తండ్రి హరివంశ రాయ్ రాసాడని అందులో పేర్కొన్నారు. అయితే ఆ కవితను ప్రముఖ గేయ రచయత ప్రసూన్ జోషీ రాశారు. ఈ విషయాన్నీ తెలుసుకున్న బిగ్ బీ చేసిన తప్పుకు గాను క్షమాపణలు కోరుతూ..చేతులు జోడించిన ఎమోజీలను జత చేస్తూ.. అసలు విషయాన్ని వెల్లడించారు.
ఇక అమితాబ్ బచ్చన్ తండ్రి హరివంశ రాయ్ బచ్చన్ మంచి కవి, ఈయన రాసిన 'అగ్నిపథ్', 'ఆలాప్', 'సిల్సిలా' పేరుతోనే అమితాబ్ బచ్చన్ సినిమాలని చేశారు. ఆ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక అటు ప్రసూన్ జోషీ విషయానికొస్తే.. అయన భాగ్ మిల్కా భాగ్', 'చిట్టగ్యాంగ్', 'తారే జమీన్ పర్' , 'ఢిల్లీ 6' వంటి చిత్రాలకు కథలను అందిచారు. ప్రస్తుతం ఈయన కేంద్ర సెన్సార్ బోర్డ్ చైర్మన్‌గా ఉన్నారు.
CORRECTION : कल T 3617 pe जो कविता छपी थी , उसके लेखक , बाबूजी नहीं हैं । वो ग़लत था । उसकी रचना , कवि प्रसून जोशी ने की है ।
— Amitabh Bachchan (@SrBachchan) August 6, 2020
इसके लिए मैं क्षमा प्रार्थी हूँ । 🙏🙏
उनकी कविता ये है - pic.twitter.com/hZwgRq32U9