Nani V Movie : 'వి' మూవీకి షాక్ ఇచ్చిన అమెజాన్ ప్రైమ్

Nani V Movie : ఇండస్ట్రీలో సెంటిమెంట్ కొదవే లేదు.. 90 శాతం ఇండస్ట్రీ సెంటిమెంట్ పైనే ఆధారపడింది అనే చెప్పాలి.. సినిమాని మొదలు

Update: 2020-09-07 04:56 GMT

nani v movie

Nani V Movie : ఇండస్ట్రీలో సెంటిమెంట్ కొదవే లేదు.. 90 శాతం ఇండస్ట్రీ సెంటిమెంట్ పైనే ఆధారపడింది అనే చెప్పాలి.. సినిమాని మొదలు పెట్టలన్నా, రిలీజ్ చేయలన్నా పక్కా సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఉంటారు మేకర్స్.. ఒక్కో సారి ఆ సెంటిమెంట్ తప్పితే ఫ‌లితం తారుమార‌వుతుంద‌ని వారి న‌మ్మకం.ఎట్టి పరిస్థితుల్లో ఆ సెంటిమెంట్ కి బ్రేక్ పడకుండా చూసుకుంటారు మేకర్స్.. అయితే తాజాగా నాని 'వి' మూవీ విషయంలో ఆ సెంటిమెంట్ బ్రేక్ పడింది.

విభిన్న చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రలు పోషించగా, అదితీరావ్ , నివేత థామస్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు.. కరోనా వలన వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా తాజాగా సెప్టెంబర్ 05 న అమెజాన్‌ ప్రైమ్‌ లో రిలీజ్ అయింది.

అయితే ఈ చిత్రాన్ని మాత్రం అమెజాన్ ప్రైమ్ వ‌ర్గాలు శుక్రవారం రాత్రి 10 గంట‌ల‌కే స్ట్రీమింగ్‌కి పెట్టేశార‌ట‌. దీనితో సెంటిమెంట్ బ్రేక్ అయినట్టు అయింది. ఎందుకంటే సెంటిమెంట్ ప్రకారం సెప్టెంబ‌ర్ 5న నాని న‌టించిన తొలి చిత్రం `అష్టాచ‌మ్మా` విడుద‌లైంది. అదే సెంటిమెంట్ ని రిపీట్ చేస్తూ ఈ సినిమాని కూడా అదే రోజున రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ సెప్టెంబ‌ర్ 4న రిలీజ్ చేయ‌డంతో ఆ సెంటిమెంట్ బ్రేక్ పడినట్టు అయింది. అటు దిల్ రాజు కూడా సెప్టెంబర్ 05 కూడా కలిసి రాలేదనే చెప్పాలి ఎందుకంటే అదే రోజున నాగచైతన్య జోష్ మూవీ రిలీజ్ అయి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.  

Tags:    

Similar News