Allu Arjun Arrest: భార్యకు ధైర్యం చెప్పి పోలీసులతో వెళ్లిన అల్లు అర్జున్
తనను అరెస్ట్ చేసే సమయంలో అల్లు అర్జున్ (allu arjun) తన భార్య స్నేహరెడ్డికి (Sneha reddy) ధైర్యం చెప్పారు.
తనను అరెస్ట్ చేసే సమయంలో అల్లు అర్జున్ (allu arjun) తన భార్య స్నేహరెడ్డికి (Sneha reddy) ధైర్యం చెప్పారు. పోలీసుల వెంట వెళ్లే సమయంలో ఆమె ముఖంలో ఆందోళన కన్పించింది. ఈ సమయంలో ఆమెకు ధైర్యం చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆయన ఆమెకు సూచించారు. భార్యకు ముద్దు పెట్టి ఆయన ఇంటి నుంచి పోలీసులతో కలిసి వెళ్లారు.
సంధ్య (Sandhya theatre) థియేటర్ తొక్కిసలాట కేసులో ఏ 3 గా అల్లు అర్జున్ ఉన్నారు. ఈ కేసులో ఆయనను అరెస్ట్(arrest) చేసేందుకు పోలీసులు ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో ముందుగా సమాచారం ఇవ్వకుండా రావడంపై పోలీసుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. డిసెంబర్ 4న పుష్ప 2 (pushpa 2) ప్రీమియర్ షో ప్రదర్శించారు. ఈ ప్రదర్శన సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి (Revathi) అనే మహిళ మరణించారు. ఆమె కొడుకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
అల్లు అరవింద్ ను పోలీస్ వాహనం ఎక్కవద్దని కోరిన అల్లు అర్జున్
అల్లు అర్జున్ ను పోలీసులు తమ వాహనంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లే సమయంలో అరవింద్ కూడా వారితో కలిసి వెళ్లేందుకు పోలీస్ వాహనం ఎక్కేందుకు ప్రయత్నించారు. అయితే అల్లు అర్జున్ తండ్రిని వారించారు. పోలీస్ వాహనం ఎక్కవద్దని కోరారు.దీంతో అరవింద్ తన చిన్న కొడుకు అల్లు శిరీష్ తో కలిసి మరో వాహనంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చారు.
అల్లు అర్జున్ కుటుంబ సభ్యులకు చిరంజీవి పరామర్శ
అల్లు అర్జున్ కుటుంబ సభ్యులను చిరంజీవి పరామర్శించారు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలియగానే ఆయన విశ్వంభర షూటింగ్ ను రద్దు చేసుకున్నారు. నాగబాబు కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు.. మరో వైపు ప్రముఖ నిర్మాత దిల్ రాజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి అల్లు అర్జున్ తో మాట్లాడారు.ఇతర సినీ ప్రముఖులు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చే అవకాశం ఉంది.