Allu Arjun Arrest: నన్ను దుస్తులు కూడా మార్చుకోనివ్వరా.. పోలీసుల తీరుపై అల్లు అర్జున్‌ అసంతృప్తి

Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాలో హీరో అల్లు అర్జున్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Update: 2024-12-13 08:12 GMT

Allu Arjun Arrest: నన్ను దుస్తులు కూడా మార్చుకోనివ్వరా.. పోలీసుల తీరుపై అల్లు అర్జున్‌ అసంతృప్తి

Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాలో హీరో అల్లు అర్జున్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతన్ని అదుపులోకి తీసుకున్న సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై బన్నీ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను దుస్తులు కూడా మార్చుకోనివ్వలేదని.. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు. మరోవైపు అల్లు అర్జున్ పిటిషన్ ను అత్యవసర పిటిషన్‌గా విచారించాలని అతని తరుపు న్యాయవాది ఎస్. నిరంజన్ రెడ్డి హైకోర్టును కోరారు.

బుధవారం పిటిషన్ ఫైల్ చేశామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే అత్యవసర పిటిషన్‌ను ఉదయం 10.30కే మెన్షన్ చేయాలి కదా అని కోర్టు ప్రశ్నించింది. దానికి సమాధానంగా క్వాష్ పిటిషన్‌ను వేసినట్లు పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లామని అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి తెలిపారు.

డిసెంబర్ 4న రాత్రి పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చారు. ఆ సందర్భంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందగా.. ఆమె కుమారుడికి గాయాలయ్యాయి. అయితే రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమంటూ బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News