RRR Updates in Telugu: ఆలియా భట్ "సీత" ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..?

RRR Updates in Telugu: రాజమౌళి పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా RRR.

Update: 2021-03-13 10:26 GMT
RRR Updates in Telugu

ఎన్టీఆర్, రామ్ చరణ్ (ఫొటో ట్విట్టర్)

  • whatsapp icon

RRR Updates in Telugu: రాజమౌళి పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా RRR. ఈ సినిమా అనౌన్స్ నుంచే దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అనే కుతూహలం పెరిగింది. ఈ నేపథ్యంలో RRRకి సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ అప్పుడుప్పుడు ఇస్తూ ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని మరింత పెంచేలా చేస్తున్నారు RRR టీం. ఇందులో భాగంగా తాజాగా హీరోయిన్ ఆలియా భట్‌కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది.

'సీత' పాత్ర పోషిస్తున్న ఆలియా భట్ ఫస్ట్ లుక్ రివీల్ చేస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 15 ఉదయం 11 గంటలకు ఈ పోస్టర్ రిలీజ్ అవుతుందని అఫీషియల్ గా ఎనౌన్స్ ఇచ్చారు. దీంతో నందమూరి, మెగా ఫ్యాన్స్ అప్ డేట్స్ కోసం వెయింటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, RRR షూటింగ్ పనులు శరవేగంగా కానిచేస్తున్నాడు జక్కన్న. ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ మూవీగా 1920 బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమాలో అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. చెర్రీ సరసన ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌ణ్ కూడా కీల‌క పాత్ర‌ పోషిస్తుండటం విశేషం. అక్టోబ‌ర్ 13RRR మూవీని విడుద‌ల చేయాలనేది జక్కన్న ప్లాన్.


Tags:    

Similar News