Viral Video: ఒకే వీడియోలో అభిషేక్, ఐశ్వర్య.. అనుమానం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
అయితే తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియో ఈ వార్తలకు ఫుల్స్టాప్ పెట్టేట్లు ఉంది
సినీ తారల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా వివాహం, విడాకులకు సంబంధించిన వార్తలు ఇట్టే వైరల్ అవుతుంటాయి. బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్‌లకు సంబంధించి ఇలాంటి వార్తే ఇటీవల తెగ వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ జంట విడిపోతుందంటూ గతకొన్ని రోజులుగా నెట్టింట వార్తలు తెగ వైరల్ అయ్యాయి.
మరీ ముఖ్యంగా ఇటీవల జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుకకు అమితాబ్ కుటుంబ సభ్యులతో కాకుండా ఐశ్వర్య ఒక్కతే రావడంతో ఈ వార్తలకు బలం చేకూర్చినట్లైంది. ఈ జంట నిజంగానే విడిపోయిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇక ఐశ్వర్య ఇప్పటికే అమితాబ్ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఓ డాక్టర్‌తో సన్నిహితంగా ఉందంటూ వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియో ఈ వార్తలకు ఫుల్స్టాప్ పెట్టేట్లు ఉంది. ఐశర్య, అభిషేక్‌లు కూతురు ఆరధ్యతో కలిసి దుబాయ్ విమానాశ్రయంలో ఉన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. దుబాయ్ ఎయిర్ పోర్ట్‌లో బస్సు ఎక్కుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. దీంతో వీరిద్దరు మధ్య వస్తున్న విడాకుల వార్తలు వట్టి పుకార్లేనని తేలిపోయిందంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే మరికొందరు నెటిజన్లు మాత్రం సరికొత్త అనుమాలకు తెర తీస్తున్నారు. ఈ వీడియో ఇప్పడిది కాదని పాత వీడియో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ‘గతేడాది అవార్డ్స్ షో కోసం వెళ్లినప్పటి వీడియో’ అని కొందరు కామెంట్స్ చేశారు. అయితే అటు అభిషేక్, ఇటు ఐశ్వర్య అధికారిక సోషల్ మీడియా హాండిల్స్‌లో ఎలాంటి పోస్ట్‌లు లేకపోవడంతో ఈ కామెంట్స్‌కు బలం చేకూర్చినట్లైంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.