సుశాంత్ మృతి పై ఎయిమ్స్ కీలక రిపోర్టు!

Sushant Singh Rajput Case : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో ఆత్మహత్య కేసులో ఢిల్లీకి చెందిన ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కీలకమైన రిపోర్టును సంప్రదించింది.

Update: 2020-09-29 06:15 GMT

Sushant Singh Rajput 

Sushant Singh Rajput Case : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో ఆత్మహత్య కేసులో ఢిల్లీకి చెందిన ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కీలకమైన రిపోర్టును సంప్రదించింది. దీనికి సంబంధించిన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో సుశాంత్ మృతదేహంలో ఎలాంటి విషం లేదని వెల్లడించింది. అంతేకాకుండా సుశాంత్ మృతికి ఉరి వేసుకోవడమే కారణమని పేర్కొంది. సుశాంత్‌ డీఎన్‌ఏను పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఈ నివేదికని సమర్పిస్తున్నామని, ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదని పేర్కొంది. మహారాష్ట్ర వైద్యుల నివేదికలో తేలిన విషయాలే తమ పరిశీలనలో కూడా తేలాయని వివరించారు.

ఇక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ 14 ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసింది.. అయితే ఇది ఆత్మహత్య కేసు అని ముంబై పోలీసులు చెప్పినప్పటికీ, ఇది హత్య అని సుశాంత్ కుటుంబంతో పాటుగా పలువురు అన్నారు.. అంతేకాకుండా ముంబై పోలీసులు ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని డిమాండ్ చేయడంతో ఈ కేసును సుప్రీంకోర్టు సీబీఐకి వెల్లడించింది. అనంతరం ఈ కేసులో అనేక మలుపులు తిరిగింది. డ్రగ్స్ కోణం బయటకు రావడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ఈ కేసును మరోవైపు విచారిస్తుంది. ఈ దర్యాప్తు కేసులో భాగంగానే సుశాంత్ రాజ్‌పుత్‌ ప్రియురాలు రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సెప్టెంబర్ 9 న అరెస్టు చేశారు.

ఇక మరోవైపు సుశాంత్‌ గొంతు నులమడం వల్లనే చనిపోయాడని అతని లాయర్‌ వికాస్‌ సింగ్‌ ఆరోపిస్తున్నారు. సుశాంత్‌ మృతదేహం ఫొటోలు చూసి ఎయిమ్స్‌ సీనియర్‌ డాక్టర్‌ ఒకరు ఈ విషయం స్పష్టం చేశారని పేర్కొన్నారు. అయితే ఈ కేసును సీబీఐ చేస్తున్న జాప్యం చేస్తుందని అన్నారు. అనుమానాస్పద మృతిపై దర్యాప్తును పక్కనబెట్టి, ఎన్సీబీ డ్రగ్స్‌ కేసుపై ఎక్కువ దృష్టి పెట్టిందని అయన ఆరోపించారు.

Tags:    

Similar News