Trisha: రాజకీయాల్లోకి హీరోయిన్ త్రిష..? ఏ పార్టీలో చేరబోతోందంటే..!

రాజకీయాల వైపు ముగ్గు చూపిస్తున్న స్టార్ హీరోయిన్

Update: 2022-08-20 14:30 GMT
Actress Trisha Planning to Enter Into Politics

Trisha: రాజకీయాల్లోకి హీరోయిన్ త్రిష..? ఏ పార్టీలో చేరబోతోందంటే..!

  • whatsapp icon

Trisha: ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించిన త్రిష కృష్ణన్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం త్రిష ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టే ఆలోచనలు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న త్రిష దాదాపు అగ్ర హీరోల అందరి సరసన నటించి తన ప్రతిభ చాటుకుంది.

గత కొంతకాలంగా ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు కూడా చేస్తూ బాగానే మెప్పించింది. కానీ వరుస డిజాస్టర్ల వల్ల ఈమెకు ఆఫర్లు బాగా తగ్గిపోయాయి. ప్రస్తుతం త్రిష చేతిలో కేవలం రెండు మూడు సినిమాలు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న "పొన్నియిన్ సెల్వన్" అయితే తాజాగా ఇప్పుడు త్రిష రాజకీయాల వైపు అడుగు వేయాలని ప్రయత్నాలు చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

దివంగత ముఖ్యమంత్రి జయలలిత, ఎంజి రామచంద్రన్ వంటి వారి స్ఫూర్తితో త్రిష కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతోందని, ప్రాంతీయ పార్టీల కన్నా జాతీయ పార్టీలలో అయితే భవిష్యత్తు బాగుంటుందని భావించిన త్రిష కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల పనులు కూడా చేస్తున్న నటులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. మరి త్రిష కూడా వారి బాటలోనే వెళ్ళనుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News